e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ టెలీకాలర్‌కు వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌

టెలీకాలర్‌కు వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌

టెలీకాలర్‌కు వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌

ఓ ప్రైవేట్‌ టెలీకాలర్‌కు నగ్న వీడియోలు, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తుంది. తన వృత్తిలో భాగంగా సంస్థకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రచారం చేయాలి. దీని కోసం చాలా మంది కస్టమర్లతో ఫోన్‌లో మాట్లాడి కంపెనీ గురించి వివరిస్తుంది. ఇలా ఓ రోజు ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్‌కు ఫోన్‌ చేసి సంస్థ గురించి వివరించింది. అతను తర్వాత మాట్లాడుతాను అని చెప్పి యువతి వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను తీసుకున్నాడు. అయితే.. నిబంధనల ప్రకారం టెలీకాలర్‌లు ఇతరులకు వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు ఇవ్వకూడదు. అయితే.. యువతి తన టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనే ఆశతో వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను ఇచ్చింది. దీంతో చంద్రవేగ్‌ ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి అనే తేడా లేకుండా వాట్సాప్‌ లో నగ్నంగా వీడి యో కాల్‌ చేస్తూ వేధిస్తున్నాడు. ఆందోళనకు గురైన ఆ యువతి సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు గురువారం చంద్రవేగ్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టెలీకాలర్‌కు వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement