గురువారం 28 మే 2020
Hyderabad - May 20, 2020 , 00:46:08

రోగ నిరోధక శక్తి పెంపునకు మార్గదర్శకాలు

రోగ నిరోధక శక్తి పెంపునకు మార్గదర్శకాలు

సైదాబాద్ : కరోనా వైరస్‌ నివారణ నేపథ్యంలో శరీర సహ జ రక్షణ వ్యవస్థను కాపాడుకోవడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. సైదాబాద్‌ డివిజన్‌ రెవెన్యూ బోర్డుకాలనీలోని భారతీయ వైద్యావిజ్ఞాన వారసత్వ సంపద సంస్థ, కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన పరిషత్‌ (ఆయుష్‌) సంస్థ దీనికి సం బంధించి ఒక ప్రకటన విడుదల చేశాయి.

శరీర సహజ రక్షణ కోసం సూచనలు

  • గోరువెచ్చని నీటినే తాగాలి. రోజులో ఏ సమయంలోనైనా అవే తాగాలి.
  • రోజూ అరగంటపాటు యోగా, ప్రాణాయా మం, ధ్యానం చేయాలి. వంటకాల్లో కచ్చితం గా పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వినియోగించాలి. వీటి వినియోగం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంపుదల కోసం

  • రోజూ ఉదయమే పది గ్రాముల(ఒక స్పూన్‌) చవన్‌ప్రాస్‌ తీసుకోవాలి.
  • హెర్బల్‌ టీ తాగాలి. లేదా తులసి/ దాల్చిన చెక్క/నల్ల మిరియాలు(బ్లాక్‌ పెప్పర్‌) శొంఠి వేసిన డికాషన్‌ తాగాలి. రుచి కోసం అందులో బెల్లం, నిమ్మరసం వేసుకోవచ్చు. రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఎండు ద్రాక్ష తినాలి. 
  • 150మిల్లీలీటర్ల వేడిపాలలో అర టీస్పూన్‌ ప సుపు వేసుకొని రోజులో రెండుసార్లు తాగాలి.

 ప్రతిరోజూ అనుసరించాల్సిన పద్ధతులు

  • నువ్వులు లేదా కొబ్బరినూనె లేదా నెయ్యి చు క్కలు రోజూ ఉదయం, సాయంత్రం ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.
  • నువ్వులు లేదా కొబ్బరినూనె ఒక స్పూన్‌ మేర నోట్లో వేసుకోవాలి. రెండు నుంచి మూడు నిమిషాలపాటు దానిని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నిత్యం రెండుసార్లు చేయాలి.

దగ్గు తగ్గడానికి ఉపాయాలు

  • సాధారణ ఉపశమనం కోసం పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకోవాలి. బెల్లం లేదా తేనెతో లవంగాల పౌడర్‌ కలుపుకొని రోజూ రెండుసార్లు తాగాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి.


logo