e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News రోడ్డు ప్రమాదంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

హైద‌రాబాద్ : రోడ్డు ప్ర‌మాదంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒక‌రు మృతిచెంద‌గా మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం ఉద‌యం రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మాన‌సాహిల్స్‌లో చోటుచేసుకుంది. మృతుడిని గండిపేట వ్యాస్‌న‌గ‌ర్‌కు చెందిన కె.సుధాక‌ర్‌(22), గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన పి.విష్ణుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ్రేహౌండ్స్ సెంట‌ర్ నుండి ఉద‌యం 5.45 గంట‌ల‌కు మోటారు సైకిల్‌పై ఇళ్ల‌కు బ‌య‌ల్దేరారు.

సుధాక‌ర్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. 6.10కి మాన‌సాహిల్స్ వ‌ద్ద‌కు చేరుకునేస‌రికి మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన వ‌ర్షం కార‌ణంగా బైక్ స్కిడ్ అయి రోడ్డుపై ప‌డిపోయింది. అంత‌ర్గ‌త గాయాల‌తో ఉన్న సుధాక‌ర్‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జ‌నర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోడ్డు ప్రమాదంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

ట్రెండింగ్‌

Advertisement