బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:45:39

భావితరాలకు నాంది హరితహారం

భావితరాలకు నాంది హరితహారం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న 

సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

కార్ఖానా పోలీసుల పనితీరుపై ప్రశంసలు

కంటోన్మెంట్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఆదివారం కార్ఖానా పరిధిలోని మడ్‌ఫోర్ట్‌ దోబీఘాట్‌తో పాటు కేవీ స్కూల్‌, అంబేద్కర్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో కార్ఖానా పోలీసుల నేతృత్వం.. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో భాగంగా సీఐ పరావస్తు మధుకర్‌ స్వామి, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భావితరాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని కార్ఖానా పోలీసులు  చేపట్టడం అభినందనీయమన్నారు.   ఆదే విధంగా రూ.15లక్షలతో  కార్ఖానా పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సదా కేశవరెడ్డి, అనితాప్రభాకర్‌, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్‌,  బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌. శ్రీనివాస్‌, డైరెక్టర్‌ దేవులపల్లి శ్రీనివాస్‌తో పాటు లయన్స్‌క్లబ్‌ ప్రతినిధి విద్యాభూషణ్‌, సుప్రజా, షడ్రక్‌, వెంకటరమణారెడ్డి, ఎస్సైలు సందీప్‌రెడ్డి, అవినాష్‌బాబు, మహిళా ఏఎస్సై దీప్‌కౌర్‌, పోలీస్‌ సిబ్బంది ఫీభా డేవిడ్‌, ప్రీతి, భార్గవి, శంకర్‌నాయక్‌, మహానంది పాల్గొన్నారు. 

 ఒక్క  సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం..

నేరాల నియంత్రణకై ప్రజల భాగస్వామ్యంతో కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. నేను సైతం ప్రాజెక్టులో భాగంగా.. కాలనీల సహకారంతో పాటు విజయ డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీఐ పరావస్తు మధుకర్‌ స్వామి అన్నారు. కార్ఖానా పీఎస్‌ పరిధిలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించడం సులభతరమని, ఇటీవల చాలా కేసుల్లో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతోనే నిందితులను గుర్తించారని పేర్కొన్నారు. 


logo