శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Jun 04, 2020 , 00:22:16

పచ్చదనం పెంపులో.. జపాన్‌ తరహా విధానం

పచ్చదనం పెంపులో.. జపాన్‌ తరహా విధానం

పెద్ద అంబర్‌పేట, దుండిగల్‌లో.. విజయవంతం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మొక్కల పెంపకంలో జపాన్‌లో ప్రాచుర్యం పొందిన మియావకి పద్ధతిని హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా దుండిగల్‌, పెద్దఅంబర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌లలోని 3000 స్కేర్‌ మీటర్ల పరిధిలో ఈ రకంగా  పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. వేర్వేరు రకాల మొక్కల కారణంగా పెరుగుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎదుగదలలో పోటీతత్వం నెలకొని అనతికాలంలోనే దట్టమైన అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నది. గత ఏడాది పెద్ద అంబర్‌పేటలో నాటిన 4x7, 5x9 మొక్కలు భారీ చెట్లుగా ఎదిగి చూడముచ్చటగా కనిపిస్తున్నది.  దీంతో ఇదే రీతిలో తాజాగా కండ్లకోయ జంక్షన్‌లో అమలు చేసేందుకు అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు చర్య లు ప్రారంభించారు. మియావకి విధానంలో సాధారణంగా నాటిన మొక్కల కంటే పది శాతం వేగంగా అభివృద్ధి చెందుతుంది  తద్వారా 30 శాతం దట్టమైన అడవి ఏర్పడుతుంది. తొలుత జపాన్‌లో మియావ అనే వ్యక్తి దీనిని ప్రారంభించారు.  అందుకే ఈ పద్ధతికి ‘మియావ’కి అనే పేరు వచ్చింది. ఈ విధానంలో మొక్కలు వేగంగా పెరుగుతున్నాయి. ఒకే జాతి మొక్కలతో ఎక్కువగా చనిపోవడం జరుగుతాయి. వేర్వేరు మొక్కలను నాటడం వల్ల అవి ఎదిగే క్రమంలో పోటీతత్వం ఉంటుందని, అందుకే ఈ పద్ధతికి డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు.