గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Jul 05, 2020 , 23:04:38

ఆధారాలతో పట్టేస్తారు

ఆధారాలతో పట్టేస్తారు

క్లిష్టమైన నేరాల ఛేదనలో క్లూస్‌..

అత్యాధునిక సాంకేతికతో విశ్లేషణ

దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం

లేటెస్ట్‌ టెక్నాలజీతో దేశంలోనే ఫస్ట్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎలాంటి నేర ఘటన జరిగినా హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ ముందుంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో పక్కా ఆ ధారాలు సేకరిస్తుంది. ఘటనకు గల కారణాలను విశ్లేషిస్తుంది. నేరస్తులు తప్పిం చుకోకుండా అతి సూక్ష్మ ఆధారాలను కూడా సేకరించి.. కేసుల ఛేదనకు తోడ్పడు తున్నది. లైంగిక దాడులు, హత్యలు, దోపిడీ, దొంగతనాలు, డ్రగ్స్‌, బాంబు పేలు ళ్లు, తుపాకీ కాల్పులు.. ఇలా ఏ ఘటన జరిగినా క్లూస్‌ టీమ్‌ ఇచ్చిన ఆధారాలతోనే పోలీసులు కేసులను ఛేదిస్తారు. నేర ఘటనల్లో సేకరించిన ఆధారాలను పరిశీలించేందుకు ప్రపంచంలోనే అత్యాధునికంగా నానో టెక్నాలజీతో తయారు చేసిన పరికరాలను ఉపయోగిస్తున్నది.  దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఉప యో గించని ఆధునిక టెక్నాలజీని వాడటంలో సిటీ క్లూస్‌ టీమ్‌ ఫస్ట్‌ ఉంది.

అధునాతన పరికరాలతో క్లూస్‌ సేకరణ...

అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో వాడుతున్న అత్యాధునిక పరికరాల కంటె.. మెరుగైన ఫలితాలిచ్చే అధునాతన క్లూస్‌ సేకరించే వివిధ రకాలైన పరికరాలను సిటీ క్లూస్‌ టీమ్‌ ఉపయోగిస్తున్నది. గ్లోబల్‌ సిటీగా మారుతున్న హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు నేరస్తుడు తప్పించుకోకుండా, అమాయకులు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వాడుతున్నారు. ఏదైనా ఘటన జరిగిందంటే..  అది ఎలా జరిగింది?... ఎవరు చేసి ఉంటారు? అనే విషయాలను పరిశీలించి, తగిన ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేయడంతో కేసుల ఛేదన కూడా త్వరగా పూర్తవుతుంది. క్లూస్‌ టీమ్‌ పకడ్బందీగా ఉన్నప్పుడే  సంచలనాత్మక కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుంది.  హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర న లుమూలలా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ తమ సహకారాన్ని ఆయా జిల్లాల పోలీసులకు అందిస్తున్నది. ఇటీవల కరీంనగర్‌లో ఓ హత్య కేసు, వరంగల్‌లో 10మంది హత్య ఘటనలతో పాటు..  సం చలనం సృష్టించిన దిశా ఘటనలో పక్కా ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందించింది.  

ప్రతి డివిజన్‌కు ఒక్కో క్లూస్‌ టీమ్‌..

హైదరాబాద్‌లోని క్లూస్‌ టీమ్‌లో ఫోరెన్సిక్‌ విభాగంలో నిష్ణాతులైన సిబ్బంది పనిచేస్తున్నారు.  నగరంలోని ప్రతి డివిజన్‌కు ఒక్కో క్లూస్‌ టీమ్‌ సేవలు అందిస్తున్నది. నగరంలో ఉన్న 17 డివిజన్లలో ఏ ఘటన జరిగినా అక్కడకు వెళ్లి క్లూస్‌ టీమ్‌ ఘ టన స్థలంలో ఆధారాలు సేకరించి, వాటిని విశ్లేషించి పోలీసులకు తగిన నివేదికను అందిస్తుంది. సిమ్‌కార్డు, హార్డ్‌ డిస్క్‌లు శిథిలావస్థకు చేరినా వాటి నుంచి డాటాను సేకరించే అత్యాధునిక ల్యాబ్‌ల్లో క్లూస్‌ టీమ్‌ ఆధారాలను విశ్లేషిస్తున్నది. 

క్లూస్‌ టీమ్‌ వద్ద ఉన్న అత్యాధునిక పరికరాలు కొన్ని..

     ఎక్స్‌ క్యాట్‌..

డ్రగ్స్‌ కేసుల్లో నిందితుల వద్ద పట్టుబడింది డ్రగ్గా?.. కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం పోలీసులు.. మొదట వాటిని క్లూస్‌ టీమ్‌కు పంపిస్తారు. వెంటనే వారు ఎక్స్‌ క్యాట్‌ యంత్రంతో పరీక్షిస్తారు.  ఈ యంత్రం... నానో టెక్నాలజీ, ఆఫ్టికల్స్‌ రీడర్స్‌తో సంబంధిత మెటీరియల్‌లోని పదార్థాలను పరీక్షించి నిమిషం వ్యవధిలోనే ఫలితాన్నిస్తుంది. అలాగే.. పేలుళ్లు జరిగినప్పుడు ఘటన స్థలంలో లభ్యమైన అవశేషాలతో పేలుళ్లలో ఎలాంటి రసాయనాలు వాడారని గుర్తిస్తారు.  

     బుల్లెట్‌ హోల్‌ టెస్టింగ్‌ కిట్‌

బుల్లెట్‌ హోల్‌ టెస్టింగ్‌ కిట్‌తో ఒక వ్యక్తికి బుల్లెట్‌ దూసుకుపోయిన చోటు, బుల్లెట్‌ బయటకు వచ్చిన తీరును గుర్తిస్తారు.  అలాగే శరీరంపై ఉండే పేలుడుకు సంబంధించిన అవశేషాలను ఫిల్టర్‌ పేపర్లతో సేకరిస్తారు. ఇక్కడ శరీరంపై ఉండే అతి సూక్ష్మమైన కణాలను సైతం సేకరించే వీలుంటుంది. సేకరించిన క్లూస్‌తో ఎక్స్‌ క్యాట్‌ యంత్రంతో ఒక నిర్ధారణకు వస్తారు.

     3డీ స్కానర్‌..

3డీ స్కానర్‌తో సంఘటన స్థలాన్ని స్కాన్‌ చేస్తారు. ఇది.. ఘటన స్థలాన్ని భిన్న కోణాల్లో స్కాన్‌ చేస్తుంది. కాల్పులు జరిగాయంటే... అవి ఎంత దూరం నుంచి జరిగాయనే సమాచారాన్ని కూడా ఈ స్కానర్‌ ఇచ్చేస్తుంది. 3డీ స్కానర్‌తో సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేసి సూక్ష్మమైన ఆధారాలను సేకరిస్తారు. 

         సూపర్‌లైట్‌...

పక్కా ప్లాన్‌తో చేసే నేరాల్లో నేరస్తులు.. పోలీసులకు ఆధారాలు లభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక హత్య జరిగిందంటే అక్కడ హత్య ఆనవాళ్లు లేకుండా వాషింగ్‌ పౌడర్‌, కెమికల్స్‌తో ఆ ప్రాంతమంతా శుభ్రం చేస్తారు. దాంతో అక్కడ నేరం జరిగిందా? అనే సందేహం రాకుం డా నిందితులు ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారు. ఇలాంటి సమయంలోనే సూపర్‌లైట్‌ను వాడుతుంటారు. సాధారణంగా ఘటన స్థలంలో సూపర్‌లైట్‌ వేసి మొదట ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తరువాత అక్కడ కొన్ని కెమికల్స్‌ వేసి ఆ ప్రాంతాన్ని లైట్‌తో పరిశీలిస్తే అతిసూక్ష్మమైన కణాలు అక్కడ కన్పిస్తాయి. హత్య జరిగి ఉంటే ఆ ప్రాం తంలో రక్తపు మరకలను ఈ లైట్‌ ద్వారా గుర్తిస్తారు.

        నార్కొటిక్‌ స్ప్రే అండ్‌ టెస్ట్‌ కిట్‌..

పట్టుబడ్డ డ్రగ్స్‌పై నార్కొటిక్‌ స్ప్రే కిట్‌తో స్ప్రే చేస్తే అందులో ఎలాంటి డ్రగ్‌ ఉందో కనిపెట్టవచ్చు. డ్రగ్‌ కలర్‌ మారే విధానం బట్టి... అది ఏ డ్రగ్‌ అని గుర్తిస్తారు. ఇది ఎన్‌సీబీ(నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) వద్ద మాత్రమే ఉంటుంది 

        స్కానర్లతో నకిలీ కరెన్సీ ...

క్లూస్‌టీమ్‌ వద్ద ఉన్న పరికరాలతో ప్రపంచ దేశాల్లోని కరెన్సీని గుర్తించవచ్చు.  అలాగే..  పాస్‌పోర్టులను.. అవి నకిలీవా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించవచ్చు. మన దేశానికి చెందిన నకిలీ కరెన్సీని వెంటనే గుర్తించే స్కానర్లు, డాటాబేస్‌లు క్లూస్‌టీమ్‌ వద్ద ఉన్నాయి. వీటితో పాటు బార్‌ కోడ్‌, హాలో గ్రామ్‌లను కూడా తనిఖీ చేయవచ్చు.

  ఏ నేరం చేసినా.. దొరికిపోతారు

ఏదైనా ఘటన జరిగితే.. అందుకు సంబంధించిన వివిధ రకాలైన ఆధారాలను సేకరిస్తాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ప్రతి ఆధారాన్ని సేకరించి, దానిని శాస్త్రీయ పద్ధతిలో ఫలితాన్ని రాబడుతాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న టెక్నాలజీతో ఏ నేరం చేసినా.. నేర ఘటనలో పక్కా ఆధారాలు సేకరిస్తాం. నేరస్తుడు టెక్నాలజీని వాడి దర్యాప్తు సంస్థలకు దొరకకుండా జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తుంటాడు. నేరస్తుడు ఎలాంటి టెక్నాలజీని వాడుతాడు, అతడు వాడే టెక్నాలజీని ఛేదించడానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ వద్ద ఉంది. నగరాన్ని క్రైమ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇతర దేశాల కంటె మెరుగైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిట్లను క్లూస్‌టీమ్‌కు సమకూర్చింది.                                    -  వెంకన్న, సైంటిస్ట్‌, హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ హెడ్‌


logo