శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Jul 08, 2020 , 00:11:57

పేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

 పేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

చిక్కడపల్లి : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో  పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. రేషన్‌ షాపు ల ద్వారా ప్రజలకు అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గాంధీనగర్‌ డివిజన్‌ లోని వివేక్‌నగర్‌ రేషన్‌ షాపులో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు ముఠా పద్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.  నాయకులు ముఠా నరేశ్‌, పోతుల శ్రీకాంత్‌, ప్రభాకర్‌, బల్ల ప్రశాంత్‌ పాల్గొన్నారు.