శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:10:39

కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

గోల్నాక: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. శుక్రవారం అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కరోనా మొబైల్‌ టెస్టింగ్‌ ఉచిత సేవలను డీసీ వేణుగోపాల్‌, ఏఎంహెచ్‌వో హేమలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వైరస్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచామన్నారు. బాగ్‌అంబర్‌పేట, తిలక్‌నగర్‌  ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆపన్నహస్తం

గోల్నాక: ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆపన్నహస్తం అందిస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తిలక్‌నగర్‌కు చెందిన కె.అనిల్‌కుమార్‌కు రూ.28వేలు, గోల్నాక ఖాద్రీబాగ్‌కు చెందిన అహ్మద్‌ హుస్సేన్‌కు రూ.60 వేలు, పటేల్‌నగర్‌కు చెందిన కృష్ణకు రూ.12వేలు, ఫాతిమా ఫర్వీనాకు రూ. 32వేలు, కుత్బుల్లాపూర్‌కు చెందిన సర్ఫుద్దీన్‌కు రూ. 11వేలు, తిమ్మాపూర్‌కు చెందిన కుమార్‌గౌడ్‌కు రూ.40వేలు, శాంతినగర్‌కు చెందిన కుమార్‌స్వామికి రూ.11వేలు, ప్రేమ్‌నగర్‌కు చెందిన మల్లేశ్‌కు రూ.10 వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.