చిక్కు ముడి గూగుల్‌తో వీడింది

- విదేశీ నిందితుల విచారణలో.. తప్పిన ఇబ్బందులు
- తాజాగా చైనా, ఆఫ్రికాకు చెందిన నిందితులను విచారించిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్ : రుణయాప్‌ల కేసుల్లో ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన చైనా దేశానికి చెందిన ఓ మహిళ, కొద్ది రోజుల కిందట సైబర్ మోసంలో అరెస్ట్ అయిన దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఓ వ్యక్తి భాషను కూడా గూగుల్ సహాయంతో ట్రాన్స్‌లేట్ చేసి వారి వాంగ్మూలాన్ని సేకరించారు. గతంలో లాగా ఆ భాష తెలిసిన అసోసియేషన్ ప్రతినిధులను తీసుకువచ్చి.. వారిని ఎదురుగా కూర్చోబెట్టి విచారించేవారు. ఇప్పడు గూగుల్‌ను ముందు పెట్టుకుని నిందితుల మాతృ భాషను ఆంగ్లంలోకి అనువదించి.. వాటి అర్థాన్ని తెలుసుకుంటున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలను మొదట ఆంగ్లంలో టైప్ చేసి.. ఆ తర్వాత గూగుల్ సహాయంతో వారి భాషలోకి అనువదించి వాటిని చూపించి.. విచారణ జరుపుతున్నారు. నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నకు వారి భాషలో టైప్ చేయించి.. వాటిని తిరిగి ఆంగ్లంలోకి మార్చుకుని పరిశీలిస్తున్నారు. ఈ విధంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దర్యాప్తును పూర్తి చేసి అన్ని వివరాలను కోర్టు ముందు పెడుతున్నారు.
చైనీస్ టూ ఇంగ్లిషు-ఇంగ్లిషు టూ చైనీస్
రాచకొండ పోలీసులు ఇటీవల ఇన్స్టంట్ లోన్ యాప్‌లకు సంబంధించిన కేసులో పుణేలోని కాల్ సెం టర్‌పై సోదాలు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్ నిర్వాహకులు పరశురాం లహు టక్వీ, అతడి భార్య లియాంగ్ టియాన్(చైనా దేశస్థురాలు), ఎస్కే అకిబ్‌ను అరెస్ట్ చేశారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు లియాంగ్ టియాన్ నుంచి కాల్ సెంటర్ వ్యవహారాలు, ఇతర అంశాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. అయి తే.. ఆమెకు చైనీస్ తప్పా ఆంగ్లం అర్థమవ్వడం లేదు. దీంతో పోలీసులు గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఆమెను ప్రశ్నించాల్సిన ప్రశ్నలను ముందుగా ఆంగ్లంలో టైప్ చేసి ఆ తర్వాత దాన్ని చైనీస్ భాషలోకి అనువదించి ఆ కాపీని ఆమెకు చూపించారు. దానికి ఆమె చైనీస్ భాషలో జవాబులను టైప్ చేయగా.. వాటిని ఆంగ్లంలోకి ట్రాన్స్‌లేట్ చేసి పరిశీలించారు. మొత్తానికి తమదైన శైలిలో ప్రశ్నలకు సంబంధించి కేసు విచారణకు అవసరమయ్యే సమాచారాన్ని కొంత మేరకు రాబట్టారు.
ఆంగ్లం వచ్చినా భాషరాదని మొరాయింపు
కొద్ది రోజుల కిందట రాచకొండ పోలీసులు దక్షిణాఫ్రికాకు చెందిన ఓ సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసులు అడిగిన ప్రశ్నలకు స మాధానం ఇవ్వకుండా ఆఫ్రికాకు చెందిన భాషను మాట్లాడాడు. ఆంగ్లం వచ్చినా.. తనకు ఏ భాష తెలియదని సతాయించాడు. దీంతో మొదట ప్రశ్నలను ఆంగ్లంలో టైప్ చేసి వాటిని దక్షిణాఫ్రికా దేశానికి చెందిన భాషలోకి మార్చి.. అతడి నుంచి సమాచారం రాబట్టి రిమాండ్‌కు పంపారు. ఇలా.. గూగుల్ సహకారంతో ఇప్పుడు పోలీసులు.. ఏ దేశస్థుడినైనా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు
తాజావార్తలు
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు
- సీఎం పదవి ప్రతి నాయకుడి కల.. నేనూ అంతే
- మంచి మీల్, ప్రేమానురాగాలు ఉంటే చాలు: రేణూ దేశాయ్
- వరుసపెట్టి పేలిన 50 డైనమైట్లు..
- అర్ధరాత్రి కోహ్లి మీటింగ్.. మెల్బోర్న్ టెస్ట్‌కు ముందు ఏం జరిగింది?
- మరికాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
- ఆస్పత్రి వద్ద బాంబు.. భయపడ్డ రోగులు
- దేశంలో కొత్తగా 14,545 కరోనా కేసులు