సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 22, 2020 , 00:01:04

అద్దంలా రహదారులు...

అద్దంలా రహదారులు...

సీఆర్‌ఎంపీ ద్వారా రోడ్డు నిర్మాణ పనులు

రూ. 20 కోట్ల వ్యయంతో 70 కిలోమీటర్ల పనులు

లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి చేసిన అధికారులు

ఫుట్‌పాత్‌లకు రంగులు, రోడ్డుకు లేన్‌ మార్క్‌లు 

అబిడ్స్‌ : జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో రూ. 20 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారుల్లో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సీఆర్‌ఎంపీ ద్వారా నిర్మాణ పనులను అధికారులు పూర్తి చేయించారు. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని ఖైరతాబాద్‌-1లో 30 కిలో మీటర్లు, ఖైరతాబాద్‌-2లో 40 కిలోమీటర్ల వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో అధికారులు ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్డు పనులను చేపట్టారు. నూతన రోడ్లను నిర్మించడంతో ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఎస్‌ఈ రత్నాకర్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. సీఈ కూడా పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండేలా దృష్టి కేంద్రీకరించారు.                             

ప్రధాన రహదారుల్లో నూతన రోడ్ల నిర్మాణం..                                                         

ఖైరతాబాద్‌ జోన్‌  14వ సర్కిల్‌లోని 

 * సంజీవయ్య విగ్రహం బీజేఆర్‌ విగ్రహం 

 * జీహెచ్‌ఎంసీ అబిడ్స్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్‌ 

 * కళాంజలి నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా 

 * అఫ్జల్‌గంజ్‌ నుంచి పుత్లీబౌలి చౌరస్తా 

 * పుత్లీబౌలి చౌరస్తా నుంచి ఎంజే మార్కెట్‌ చౌరస్తా

 * ఏక్‌మినార్‌ మసీద్‌ నుంచి దారుస్సలాం రోడ్‌

 * టప్పాచబుత్రా ఎక్స్‌ రోడ్‌ నుంచి పురానాపూల్‌ 

 * బోయిగూడ కమాన్‌ నుంచి గోషామహల్‌ పెట్రోల్‌ బంక్‌

 * పురానాపూల్‌ జంక్షన్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ 

 * టక్కర్‌వాడీ జంక్షన్‌ నుంచి గోడేకీఖబర్‌ వరకు బీటీ రహదారులను నిర్మించారు.


12వ సర్కిల్‌  పరిధిలో..

* విజయనగర్‌ కాలనీ కెనరా బ్యాంక్‌ నుంచి ఎన్‌ఎండీసీ 

* అల్‌సబా కేఫ్‌ నుంచి సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ 

* మాసాబ్‌ట్యాంక్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌

* మాసాబ్‌ ట్యాంక్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి పెన్షన్‌ ఆఫీస్‌

* లక్డీకాపూల్‌ బ్రిడ్జి నుంచి ఐటీ టవర్‌ జంక్షన్‌ 

* గోకుల్‌నగర్‌ జంక్షన్‌ నుంచి మల్లెపల్లి ఎక్స్‌ రోడ్‌

* ఎన్‌ఎండీసీ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌

* గుడిమల్కాపూర్‌  ఎల్‌ఐసీ ఆఫీస్‌ నుంచి యాదవ్‌ భవన్‌

* మెహిదీపట్నం సిగ్నల్‌ నుంచి ఎల్‌ఐసీ ఆఫీస్‌ 

* ఫిర్దోస్‌ హోటల్‌ నుంచి మల్లెపల్లి ఎక్స్‌ రోడ్‌

* పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 80 నుంచి 110

* పిల్లర్‌ 102 నుంచి లంగర్‌హౌజ్‌ ఫ్లైఓవర్‌ గాంధీ విగ్రహం

* నెహ్రూ చిల్డ్రన్‌ స్కూల్‌ నుంచి పురానాపూల్‌ జంక్షన్‌  

* పిల్లర్‌ నంబర్‌ 102 నుంచి రాంసింగ్‌పురా జంక్షన్‌  

* నెహ్రూ చిల్డ్రన్‌ స్కూల్‌ నుంచి టప్పాచబుత్రా పాత పోలీస్‌ స్టేషన్‌

* జియాగూడ 2జె బస్టాప్‌ నుంచి పురానాపూల్‌ జంక్షన్‌  

* టోలిచౌకి ఎక్స్‌ రోడ్‌ నుంచి సెవెన్‌ టూంబ్స్‌  

* ఫతే దర్వాజ నుంచి గోల్కొండ ఫోర్ట్‌ 

* గోల్కొండ మెయిన్‌ గేట్‌ నుంచి బంజారి దర్వాజ,

* హ్యాండ్‌ సింబల్‌ నుంచి ఆంధ్రా ఫ్లోర్‌ మిల్‌, 

* లంగర్‌హౌజ్‌ ఫ్లై ఓవర్‌ నుంచి వన్‌మోర్‌ కాలనీ మెయిన్‌ రోడ్‌వరకు


 ఖైరతాబాద్‌-2 పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో కూడా బీటీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు.                                             

లేన్‌ మార్కింగ్‌ పనులు చేపడుతాం.. 

                సీఆర్‌ఎంపీ ద్వారా 70 కిలో మీటర్ల వరకు బీటీ రహదారుల నిర్మాణ పనులు పూర్తి చేశాం. పూర్తయిన రహదారులకు లేన్‌ మార్కింగ్‌ చేయడం, ఫుట్‌పాత్‌లు లేని ప్రాంతాల్లో  ఫుట్‌పాత్‌ల నిర్మాణం, రంగులు వేయడం, మరమ్మతు పనులను చేపడుతాం. ప్రధాన రహదారులన్నింటిలో సీఆర్‌ఎంపీ ద్వారా 20 కోట్ల వ్యయంతో పనులను పూర్తి చేశాం.

- రత్నాకర్‌, ఎస్‌ఈ, ఖైరతాబాద్‌ జోన్‌

              
logo