శనివారం 23 జనవరి 2021
Hyderabad - Sep 21, 2020 , 00:39:35

పూలు కోయడానికి వెళ్తూ.. కిందపడి వృద్ధుడు మృతి

పూలు కోయడానికి వెళ్తూ.. కిందపడి వృద్ధుడు మృతి

మియాపూర్‌ : పూలు కోయడానికి వెళ్తూ.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు.  కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకా రం.. కేపీహెచ్‌బీ కాలనీ మలేషియన్‌ టౌన్‌షిప్‌లో ఘన్నమనేని  రామ్‌దాస్‌(75) నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో రాందాస్‌ పూలు కోసేందుకు ఫ్లాట్‌లో నుంచి బయటకు వె ళ్లాడు. అయితే.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన వాచ్‌మన్‌ తిప్పనాయక్‌ .. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 logo