గురువారం 09 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 02:24:16

ఐటీ కారిడార్‌కు నీటి ఇక్కట్లు లేకుండా గోదావరి జలాలు

ఐటీ కారిడార్‌కు నీటి ఇక్కట్లు లేకుండా గోదావరి జలాలు

హైదరాబాద్ : ఐటీ కారిడార్‌కు శాశ్వతంగా నీటి కష్టాలు తొలిగిపోనున్నాయి. ఇప్పటికే  రూ. 420 కోట్లతో ఘన్‌పూర్‌ నుంచి ముత్తంగి జంక్షన్‌ వరకు రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ద్వారా ఐటీ కారిడార్‌కు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారులు.. తాజాగా ముత్తంగి జంక్షన్‌ నుంచి కోకాపేట వరకు దాదాపు 18 కిలోమీటర్ల మేర భారీ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.

 త్వరలోనే సర్వీస్‌రోడ్డు వెంబడి 3000 డయా ఎంఎం సామర్థ్యం కలిగిన భారీ పైపులైన్‌ పనులు చేపట్టనున్నారు. రూ.280 కోట్ల ఈ  ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేసే దిశగా జలమండలి చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ఇంతకాలం సింగూరు, మంజీరా జలాలపై ఆధారపడి నీటి ఎద్దడిని ఎదుర్కొన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను మళ్లించి నీటి ఇబ్బందులు తొలిగించనున్నారు. 


logo