ఫోన్.. ప్రాణం తీసింది

- ఆడుతుండగా కిందపడి పగిలిన స్నేహితుడి ఫోన్
- తల్లి తిడుతుందేమోనని భయంతో బాలిక ఆత్మహత్య
మియాపూర్ : స్నేహితుడి ఫోన్‌తో ఆడుకుంటుండగా...అది ఒక్కసారిగా కిందపడి పగిలిపోయింది.. దీంతో తన తల్లి తిడుతుందేమోనని భయపడిన ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ రవికిరణ్ వివరాల ప్రకారం.. న్యూ కాలనీలో అనిల్, సంగీత దంపతులు కూతురు అనిత(14)తో కలిసి ఉంటున్నారు. అనిత 6వ తరగతి చదువుతుంది. అనిల్ కూలీ పని చేసుకుంటుండగా ...సంగీత ఇండ్లలో పనిచేస్తున్నది. కాగా..అనిత శనివారం సాయంత్రం స్నేహితుడి ఫోన్‌తో ఆడుతుండగా...ప్రమాదవశాత్తు అది చేతిలో నుంచి కిందపడి పగిలిపోయింది. ఈ విషయమై బాలిక, ఆమె స్నేహితుడి మధ్య గొడవ జరిగింది. దీనిపై స్నేహితుడు తన తల్లికి ఫిర్యాదు చేయడంతో.. తనను కొడుతుందేమోనని భయపడింది.. ఈ క్రమంలో ఇం ట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇంటికి చేరుకున్న తల్లికి కూతురు వేలాడుతూ కనిపించగా స్థానికుల సాయంతో కిందకు దించి సమీపంలోని దవాఖానకు తరలించగా...చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- కోరుట్లలో కరోనా కలకలం
- మూడో టెస్ట్ ఎఫెక్ట్.. పింక్ బాల్ మారుతోంది!
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్‌బాల్ లెజండ్ పీలే
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు