శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1: పబ్‌లో ఓ చిన్నారి డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్‌లో ఎస్ఎల్ఎన్ టర్మినల్ వాణిజ్య సముదాయంలో ది లాల్ స్ట్రీల్ పబ్‌లో పదేండ్ల లోపు చిన్నారి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి.. మంగళవారం రాత్రి సోషల్‌మీడియా ద్వారా సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి నియంత్రణ కోల్పోయే అవకాశం ఉన్న వ్యక్తుల మధ్య చిన్నారి డ్యాన్స్ ఫ్లోర్‌పై నృత్యం చేయడం వల్ల ఆ బాలికకు ప్రమాదం జరిగి గాయపడే అవకాశం ఉందని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు విచారణకు ఆదేశించారు. పబ్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు సదరు ఘటనపై విచారణ చేపట్టి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పబ్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు తెలిపారు.