లండన్: కామెంటేటర్‌గా మారిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఈ మధ్య ఓ మ్యాచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. శ్రీలంక, ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ సందర్భంగా బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి.. ఎప్పుడూ బాగానే అనిపిస్తాయి అని అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్‌కు తన బ్యాట్ కంటే అవతలి వ్యక్తి బ్యాటే ఎక్కువగా నచ్చుతుందని చెబుతూ కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపడంతో అతడు క్షమాపణ చెప్పాడు.
గత మ్యాచ్‌లో జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. నిజంగా నా ఉద్దేశం అది కాదు. పొరపాటున అలా జరిగిపోయింది. అందరికీ క్షమాపణ చెబుతున్నాను. అలా చెప్పడం కచ్చితంగా సరైనది కాదు అని కార్తీక్ అనడం గమనార్హం. నన్ను క్షమించండి. ఇలాంటిది మళ్లీ జరగదు. నా భార్య, తల్లి కూడా నన్ను ఆ మాట అన్నందుకు మందలించారు అని కార్తీక్ చెప్పాడు.