20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ

సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్న్స, ముద్రబోయిన శ్రీనివాస రావు, మీర్ బాసిత్ అలీ, సామ స్వప్న, మిర్జా ముస్తఫా బేగ్, సున్నం రాజ్‌మోహన్, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా పద్మానరేశ్, కొలను లక్ష్మి, వి.సింధు, సబితాకిశోర్, బైరగోని ధనుంజయభాయ్, అరుణలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొని 20అంశాలను ఆమోదించారు. జీహెచ్ఎంసీలో 3142 మంది శాశ్వత ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లేమ్ పాలసీ వర్తింపు. 49మంది అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించడం, పలు జంక్షన్లు, సెంట్రల్ మీడియంలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద అభివృద్ధి చేయడం, నగరంలో కొత్తగా 700ట్రాఫిక్ కంట్రోల్ అంబ్రిల్లాలను ఏర్పాటు చేయడం సహా తదితర అంశాలను గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు.
ఆమోదించిన తీర్మానాలు
- జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో జీహెచ్ఎంసీ పార్కు నిర్వహణను సైబర్ సిటీ బిల్డర్స్‌కు సీఎస్ఆర్ కింద చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు.
- పంజాగుట్ట శ్మశానవాటికను ఆధునీకరించే పనులను సీఎస్ఆర్లో భాగంగా మేసర్స్ ఫోనిక్స్ గ్రూప్‌కు అనుమతించడం.
- మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి రోలింగ్ హిల్స్ గచ్చిబౌలి వరకు సెంట్రల్ మీడియం నిర్వహణను సీఎస్ఆర్ కింద ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి అప్పగించడం.
- ఐకియా ఫ్లై ఓవర్ వద్ద సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వహణ బాధ్యతలను సీఎస్ఆర్ కింద మేసర్స్, ఎస్పీ గ్లోబల్‌కు అప్పగింత.
- కొత్తగూడ జంక్షన్ నుంచి అల్విన్ క్రాస్ రోడ్ వరకు సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వహణ బాధ్యతలను సీఎస్ఆర్ కింద కిమ్స్ దవాఖాన ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగింత.
- నానక్‌రాంగూడ ఎంటర్ కాంటినెంటల్ టవర్ రోడ్ సౌల్డర్ల గ్రీనరీ నిర్వహణను ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు అప్పగింత.
- జీహెచ్ఎంసీలోని 3142మంది శాశ్వత ఉద్యోగులకు మెడిక్లేమ్ గ్రూప్ పాలసీ వర్తించేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి రూ.2,98,49,000 చెల్లించేందుకు ఆమోదం.
- జీహెచ్ఎంసీలోని 49మంది అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి.
- 10 మంది డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-3 ఉద్యోగులకు టౌన్‌ఫ్లానింగ్ సూపర్వైజర్లుగా పదోన్నతి.
- భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను మరో సంవత్సరం పాటు కొనసాగింపు.
- బంజారాహిల్స్ రోడ్ నం 12లోని విరంచి దవాఖాన నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 30, 36 మీటర్ల మేర రహదారి విస్తరణకు 306 ఆస్తుల సేకరణ.
- స్ప్రింగ్ వ్యాలీ నుంచి శిల్పా వ్యాలీ వరకు 30ఫీట్ల రహదారి విస్తరణకు 92ఆస్తుల సేకరణ.
- కుషాయిగూడ నుంచి డీ మార్ట్ మీదుగా దమ్మాయిగూడ వరకు 18మీటర్ల మేర రోడ్డు విస్తరణకు 196ఆస్తుల సేకరణ.
- వీది శునకాల స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ జోన్‌కు ఒక షెల్టర్ మేనేజర్, ముగ్గురు పారా వెటర్నరీ సిబ్బంది నియామకం.
- పాటిగడ్డ నల్లపోచమ్మ గుడి సమీపంలో రూ.5.90కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం.
- పంజాగుట్ట శ్మశానవాటిక ఆధునీకరణకు స్థలాన్ని సీఎస్ఆర్ కింద ఫోనిక్స్ సంస్థకు అప్పగింత.
- జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ కంట్రోల్ బూత్‌ల వద్ద 700ట్రాఫిక్ అంబ్రిల్లాల ఏర్పాటుకు బీఓటీ పద్ధతిన టెండర్లు పిలిచేందుకు తీర్మాణం.
- ఎన్ఎన్డీపీ కార్యాలయాన్ని ఏసీ గాడ్స్ ఆర్ అండ్ బి కాంప్లెక్స్ 5వ ఫ్లోర్లో ఏర్పాటు చేసేందుకు రూ.70 లక్షలు కేటాయింపు.
- స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛ భారత్ మిషన్ విభాగాల్లో ఐదుగురు సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం.
- అంబర్‌పేట నియోజకవర్గంలో మూడు పార్కులను అభివృద్ధి చేసేందుకు రూ.2.98 కోట్లు కేటాయింపు.
తాజావార్తలు
- భర్తపై కోపంతో కొడుకును రోడ్డుపై వదిలేసిన తల్లి
- వేధింపులా.. అయితే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి
- వైజాగ్ కేంద్రంగా గంజాయి దందా
- పెట్రో వాత మళ్లీ మొదలు.. ఎంత పెరిగిందంటే..?
- దురాజ్‌పల్లి జాతర.. రేపటినుంచి వాహనాల దారి మళ్లింపు
- కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించారు
- వాణి వినిపించాలంటే.. విద్యావేత్తకే పట్టం కట్టాలె..
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం