శనివారం 16 జనవరి 2021
Hyderabad - Nov 13, 2020 , 06:12:32

బల్దియా బడ్జెట్‌ రూ. 5,600 కోట్లు..

బల్దియా బడ్జెట్‌ రూ. 5,600 కోట్లు..

  • స్థాయీసంఘం ముందుకు ప్రతిపాదనలు
  • ఈ యేడు రూ.220కోట్లు అదనం
  • రోడ్లు, ఫుట్‌పాత్‌లకు రూ.1,582.51కోట్లు
  • ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ.905.30కోట్లు
  • పచ్చదనానికి రూ.560కోట్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రానున్న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,600 కోట్ల అంచనాలతో బల్దియా బడ్జెట్‌ను అధికారులు సిద్ధం చేశారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన స్థాయీసంఘం సమావేశంలో ప్రవేశ పెట్టారు. అత్యధికంగా ఆస్తి పన్ను ద్వారా 32 శాతం.. అంటే రూ. 1850 కోట్లు సమకూరుతుందని, 22 శాతం అంటే.. రూ.1224.51కోట్లు రుణాల ద్వా రా సమీకరించుకోవాలని పేర్కొన్నారు. యూజర్‌ చార్జీల ద్వారా రూ.1022.70 కోట్లు, ప్లాన్‌ గ్రాంట్ల కింద రూ.770.51కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు రూపొందించారు. వ్యయానికి సంబంధించి పేవ్‌మెంట్స్‌కు రూ. 1582.51 కోట్లు, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు రూ. 1226.91కోట్లు, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ. 905.30 కోట్లు, పచ్చదనం పెంపు కోసం గ్రీన్‌ బడ్జెట్‌కు రూ. 560.00కోట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం బల్దియా బడ్జెట్‌ను డిసెంబర్‌ 10లోగా స్థాయీసంఘం ఆమోదించి, 15లో గా జనరల్‌ బాడీకి పంపాల్సి ఉంటుంది. అక్కడ జనవరి 10లోగా సమీక్షించి, ఫిబ్రవరి 20 వరకు ఆమోదించాలి. అనంతరం మార్చి 7 నాటికి ప్రభుత్వానికి నివేదించాలి.