Hyderabad
- Dec 03, 2020 , 07:01:19
పెరిగిన పోలింగ్ శాతం

జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది. రెండు దశాబ్దాలుగా జరిగిన పలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంటే ఈసారి నమోదైన పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం విశేషం. గ్రేటర్‌వ్యాప్తంగా 9,101 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన వివరాలను క్రోఢీకరించిన ఎన్నికల అధికారులు బుధవారం మధ్యాహ్నం పోలింగ్ శాతాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట్ మినహా మిగిలిన 149 డివిజన్లలో మొత్తం 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు.