గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 01:13:17

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు సుందరీకరిస్తాం..

 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు సుందరీకరిస్తాం..

కంటోన్మెంట్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలను సుందరీకరిస్తామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆర్టీసీ,  ట్రాఫిక్‌ పోలీస్‌, సీఆర్‌ఎంపీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ముందు జంక్షన్‌ అభివృద్ధి, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రపంచస్థాయి స్టేషన్‌గా ఎదుగుతున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని మేయర్‌ చెప్పారు. 

వారి సౌకర్యార్థం తగిన వసతులు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, జంక్షన్‌ అభివృద్ధిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంట్రల్‌ మీడియన్లు, బస్‌షెల్టర్ల ఆధునీకరణ, అధునాతన మరుగుదొడ్లు, షీ టాయిలెట్లు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ట్రాఫిక్‌, అర్టీసీ అధికారులు పాల్గొన్నారు.


logo