e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ నివాసమా..? వాణిజ్యమా?!

నివాసమా..? వాణిజ్యమా?!

  • జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాల సర్వేలో తేలుతున్న అక్రమాలు
  • 200లకు పైగా వాణిజ్యానికి మారిన నివాస భవనాలకు నోటీసులు
  • 15 రోజుల గడువు – లేని పక్షంలో ఫెనాల్టీలు తప్పవని హెచ్చరికలు
  • సీఆర్‌ఎంపీ రహదారుల మార్గాల్లో ఆస్తి పన్ను మదింపునకు రంగంలోకి ప్రత్యేక బృందాలు

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మహా నగరంలో గృహ నిర్మాణాలకు అనుమతి పొంది ఆ తర్వాత వాటిని వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాల కేంద్రాలుగా నిర్వహిస్తూ ఇంటి యజమానులు సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే. నివాసాలకు అనుమతి పొంది వాణిజ్యానికి ఉపయోగించడం అక్రమమని, ఇది సబబు కాదని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అలాంటి నిర్మాణాలపై దృషి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ మేరకు వాణిజ్య కారిడార్లలో జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం ప్రత్యేక సర్వే జరుపుతోంది. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఎన్‌ఏసీ) ద్వారా ఎంపికైన ఇంజినీర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లతో కూడిన బృందాలు 118 మార్గాల్లో అన్ని భవనాలను సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా 118 మార్గాల్ని వాణిజ్య కారిడార్లుగా మార్చడం తెలిసిందే. ఈ కారిడార్లన్నీ దాదాపుగా సీఆర్‌ఎంపీలోని 709 కిలో మీటర్ల మేర రహదారుల మార్గాల్లోనే గడిచిన నెల రోజులుగా సర్వే చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ జాబితాలో నివాసంగా అనుమతులు పొందినన్నప్పటికీ ఆ తరువాత, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

- Advertisement -

నివాసంగా అనుమతి పొంది వాణిజ్యానికి మారిన భవన యాజమాలను ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం వస్తుందని భావించి ఈ సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగానే గడిచిన నెల రోజుల సర్వేలో దాదాపు 200లకు పైగా వాణిజ్యానికి మారిన భవనాలకు నోటీసులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ జాబితాలో నివాస భవనంగా ఉండి, ప్రస్తుతం వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులకు వాటిని వాణిజ్య కేటగిరిలోకి మార్చుకోవాలని సూచిస్తూ నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లోగా నివాసం ఉంచి వాణిజ్య కేటగిరికి మార్చుకోవాలని, లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మే రకు ఫెనాల్టీ పడుతుందని సదరు నోటీసులో పేర్కొంటున్నారు. కేటగిరి మార్పు ఆన్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలో తెలిపే వివరాలతో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.

తొలి దశలో సీఆర్‌ఎంపీ రహదారుల మార్గాల్లో..

  • తొలిదశలో సీఎంఆర్‌పీకి చెందిన ప్రధాన రహదారుల మార్గాల్లో ఈ సర్వే జరుపుతున్నారు. అనంతరం ఇతర మార్గాల్లోనూ చేపట్టనున్నారు.
  • సీఎంఆర్‌పీ మార్గాల్లో సర్వే వల్ల ఓ వైపు ఆస్తిపన్ను పెరగడంతోపాటు మరోవైపు ఇంపాక్ట్‌ ఫీజు కూడా రానున్నది. వాణిజ్య కారిడార్‌లో నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్యం నిర్వహిస్తున్న భవనాల నుంచి ఇంపాక్ట్‌ ఫీజు 33 శాతం పెనాల్టీతో వసూలు చేయనున్నారు. అందుకు 3నెలల గడువివ్వనున్నారు. ఆ తర్వా త నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు.
  • ఆస్తి పన్నుకు సంబంధించి తొలి దశలో ప్రజలే స్వచ్ఛందంగా కేటగిరి మార్చుకునేందుకు అవకాశం ఇస్తున్నామని, భవనం విస్తీర్ణం కొలతలు వేయడం పనులు కూడా చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.
  • నివాసం నుంచి వాణిజ్యానికి మారిన వారేకాక ఇంతవరకు ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌ కాని వారు అసలు విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికి ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారు (అండర్‌ అసెస్డ్‌) సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. వివరాలకు https;//sa.ghmc.gov.in లో క్లిక్‌ చేయాలని సూచిస్తున్నారు.

వాణిజ్య కారిడార్‌లో అదనంగా ఇంపాక్ట్‌ ఫీ ఇలా..

  • కమర్షియల్‌ రోడ్లుగా మారిన కొత్తగా నిర్మాణం చేపట్టే భ వనాల్లో ఇంపాక్ట్‌ ఫీ అదనంగా వసూలు చేయనున్నారు.
  • ఇందులో నిర్మాణంలో భాగంగా ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు ప్రతి చదరపు అడుగుకు రూ.300లు లేదా ఆరు శాతం అదనంగా వసూలు చేస్తారు. అంతకు మించి అంతస్తులకు మూడు శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ.150ల చొప్పున వసూలు చేస్తారు.
  • ఈ కేటగిరిలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాల్స్‌, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటల్స్‌, పబ్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, హోల్‌సేల్‌ మార్కెట్లు, పెట్రోల్‌ స్టేషన్లు, మోటారు రిపేర్‌ గ్యారేజీలు ఉంటాయి.
  • మరో కేటగిరిలో హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోంలు, విద్యా సంస్థలు, ప్రజా ఉపయోగ షాపులకు (500 గజాలలోపు ఉన్న భవనాల్లో) నివాస భవనాలు, వ్యాపార కార్యకలాపాలు ఉండే భవనాలకు ఇంపాక్ట్‌ ఫీ ఇలా ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు వరకు రెండు శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై నిర్మించే అంతస్తులకు ఒక శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ.50ల చొప్పున ఇంపాక్ట్‌ ఫీను వసూలు చేస్తారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement