e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ సెల్లార్‌ తవ్వకాలు బంద్‌

సెల్లార్‌ తవ్వకాలు బంద్‌

సెల్లార్‌ తవ్వకాలు బంద్‌
  • సెప్టెంబర్‌ నెలాఖరు వరకు నిషేధం
  • వానకాలం నేపథ్యంలో బల్దియా నిర్ణయం
  • అక్రమంగా తవ్వితే క్రిమినల్‌ కేసులు నమోదు
  • ప్రమాదకర గోడలు, శిథిల భవనాల కూల్చివేత
  • త్వరలో నగరవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌
  • కూలేందుకు సిద్ధంగా ఉన్న 215 పురాతన భవనాలపై నజర్‌
  • శిథిల భవనాలు, తవ్వకాల నిషేధంపై మార్గదర్శకాలు

బహుళ అంతస్థులు, సాధారణ నిర్మాణాల కోసం జరిపే సెల్లార్‌ తవ్వకాలను జీహెచ్‌ఎంసీ నిషేధించింది. వానకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఈ నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, ఎవరైనా ధిక్కరించి తవ్వకాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ రెండురోజుల కిందట జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్లార్‌ ప్రమాదాలు చోటు చేసుకోవద్దని, ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని అన్ని సర్కిళ్ల జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అలాగే నగరవ్యాప్తంగా గతేడాది కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 215 భవనాలతోపాటు పురాతన భవనాలను తనిఖీ చేసి ప్రమాదకరంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ భవనాల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శిథిల భవనాలు, సెల్లార్‌ తవ్వకాలపై పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రమాదాలు జరుగకుండా సెల్లార్‌ తవ్వకాలపై మూడు నెలల నిషేధాన్ని విధిస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నది. నిబంధనలు పాటించకపోతే యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ రెండ్రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేయగా, తక్షణం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే తవ్వకాలు జరిపి ఉంటే వానాకాలం పూర్తయ్యే వరకు వాటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ.. యజమానులను నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్‌ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సంకల్పించారు. అలాగే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 215 భవనాలతో పాటు పురాతన భవనాలను తనిఖీలు చేసి.. ప్రమాదకరంగా ఉంటే నోటీసులు జారీ చేస్తారు.

మార్గదర్శకాలివి..

  • శిథిల భవనాల గుర్తింపునకు సర్వే నిర్వహించి, తదుపరి చర్యలకు ఇంజినీరింగ్‌ విభాగానికి నివేదిక ఇవ్వాలి. వారు భవనానికి ధృడత్వ పరీక్షలు నిర్వహిస్తారు.
  • కొత్తగా గుర్తించిన శిథిల భవనాలతో కలిపి సర్కిళ్ల వారీగా జాబితా సిద్ధం చేయాలి.
  • శిథిలాల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్‌..
  • ప్రమాదకర భవనం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
  • కాల్‌సెంటర్‌, కంట్రోల్‌ రూం, వాట్సాప్‌ గ్రూపులకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలి.
  • రోజూ నివేదికను కార్యాలయానికి పంపాలి.

సెల్లార్‌ తవ్వకాలపై ..

  • వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్‌ తవ్వకాలు నిలిపివేయాలి.
  • ఇప్పటికే తవ్వి ఉంటే అక్కడ అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి. ప్రమాదానికి ఆస్కారం ఉంటే వెంటనే సీ అండ్‌ డీ విభాగం సహకారంతో సెల్లార్‌ను మూసివేయాలి.
  • అక్రమంగా ఎవరైనా సెల్లార్‌ తవ్వితే చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.
  • బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వంటి కొండ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉండే గోడల వెంబడి తాత్కాలిక గుడిసెల్లో నివసించే వారిని ఖాళీ చేయించాలి.

లోపాలున్నట్లు తేలితే కఠిన చర్యలు

  • సెల్లార్‌ తవ్వకాలపై నిషేధం విధించడమే కాకుండా ప్రహరీల ప్రమాదాలకు సంబంధించి గత అనుభవాలు పునరావృతం కాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాం.
  • కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనాలను గుర్తించి.. వెంటనే కూల్చివేస్తాం.
  • గతంలో నోటీసులు ఇచ్చిన భవనాలను తనిఖీ చేస్తాం.
  • అవసరాలకు అనుగుణంగా మరమ్మతు లు సూచించడమో, లేక సీల్‌ చేయడమో చేస్తాం.
  • భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను ప్రణాళిక విభాగం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు.
  • రక్షణ చర్యల్లో లోపాలున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు.
  • -ఎస్‌. దేవేందర్‌రెడ్డి, నగర ముఖ్య ప్రణాళికాధికారి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సెల్లార్‌ తవ్వకాలు బంద్‌

ట్రెండింగ్‌

Advertisement