e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ బహిరంగ ప్రాంతాల్లో చెత్త కనిపించొద్దు

బహిరంగ ప్రాంతాల్లో చెత్త కనిపించొద్దు

బహిరంగ ప్రాంతాల్లో చెత్త కనిపించొద్దు

కేపీహెచ్‌బీ కాలనీ, మే 16 : బహిరంగ ప్రాంతాల్లో చెత్తాచెదారం కనిపించొద్దని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆటోలోనే చెత్త వేసేలా అవగాహనను పెంచాలని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత అన్నారు. ఆదివారం శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా కూకట్‌పల్లి సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, జీవీపీ పాయింట్లలో చెత్తాచెదారం సేకరణ, నర్సరీలు, పార్కులు, పబ్లిక్‌ టాయిలెట్లు, కంపోస్ట్‌ పిట్స్‌, రియూజ్‌ స్టోర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరచుగా చెత్త వేసే, డస్ట్‌బిన్లు తొలగించిన ప్రాంతాల్లో చెత్తాచెదారం వేయకుండా చూడడంతో పాటు వేసిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. పబ్లిక్‌ టాయిలెట్లు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ పరిసరాల కోసం ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వీరి వెంట ఏఎంహెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బహిరంగ ప్రాంతాల్లో చెత్త కనిపించొద్దు

ట్రెండింగ్‌

Advertisement