హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఫిజిటల్, అనలటిక్స్, బ్లాక్‌చెయిన్, డెవోప్స్లో విభాగాల్లో మరింత పట్టు సాధించడానికి దోహదం చేయనున్నది. అలాగే జెన్క్యూకి చెందిన 600కి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్వాలిటెస్ట్ పరిధిలోకి జతకానున్నారు. 2003లో ప్రారంభమైన జెన్‌క్యూ.. హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్, రిటైల్ రంగాలకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవలు అందించనున్నది. జెన్‌క్యూ సీఈవో మురళి బొల్లు మాట్లాడుతూ..క్వాలిటెస్ట్ భాగస్వామిగా మారడంతో జెన్‌క్యూ అతిపెద్ద సంస్థగా అవతరించినట్లు అయిందన్నారు.