జంతు వ్యర్థాలతో కల్తీనెయ్యి..టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

చార్మినార్ : జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ఓ కేంద్రంపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడు లు నిర్వహించి.. 70 కిలోల కల్తీ నెయ్యిని స్వా ధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరా ల ప్రకారం.. కామాటిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే మహేశ్ (38) శ్రీ శక్తి ట్రేడర్స్ పేరుతో నెయ్యి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ ట్రేడర్స్ పేరుతో నగరవ్యాప్తంగా కిరాణా దుకాణాలకు నెయ్యి సరఫరా చేస్తున్నాడు. అయితే.. మహేశ్ సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీగా ఉందని పలువురు వినియోగదారులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం శ్రీ శక్తి ట్రేడర్స్‌పై దాడులు నిర్వహించా రు. ఈ సందర్భంగా శ్రీ శక్తి ట్రేడర్స్ ఆవరణలో ఇతర వ్యర్థాలు, కొవ్వు పదార్థాలతో కల్తీ నెయ్యి తయారుచేసి వినియోగదారుల ను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి 50 వేల విలువైన 70 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని.. తదుపరి విచారణ నిమిత్తం కేసును కామాటిపుర పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
- క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- పది అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు
- చోరీ తమిళనాడులో.. దొరికింది హైదరాబాద్‌లో..
- ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ
- ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాలా? : ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు
- ఇది అత్యత్తమ పోలీస్ శిక్షణ కళాశాల
- శ్రీసుధకు సినిమాటోగ్రాఫర్ నుండి ప్రాణహాని!
- కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?
- మోదీకి తమిళ ప్రజలపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- క్యాపిటల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !