బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 02:14:45

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్‌.. 41 కేజీలు స్వాధీనం

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్‌..  41 కేజీలు స్వాధీనం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 41కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం..షాహినాథ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ ప్రాంతంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే సమాచారం మేరకు వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుముల్లు బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పురానాపూల్‌లోని గాంధీ విగ్రహం సమీపంలో శివసింగ్‌, దీపక్‌సింగ్‌, నితిన్‌ సింగ్‌ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును షాహినాథ్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.


logo