న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనాకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్ లభ్యతను తెలియజేసేలా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తన వెబ్సైట్ (readytofightcovid.in)లో సమాచారాన్ని పొందుపరుస్తున్నది. ఈ రెండు ఔషధాలు లభించే దవాఖానలు, మెడికల్ షాపుల జాబితాను వాటి ఫోన్ నంబర్లు, చిరునామాలతోపాటు ఆ వెబ్సైట్లో చూడవచ్చు.800-266-708 నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. మరో ఫార్మా సంస్థ సిప్లా హెల్ప్‌లైన్ నంబర్ 8657311088. info.availability@cipla.comకు ఈ-మెయిల్ చేయవచ్చు.