e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

సిటీబ్యూరో, జూన్‌ 14(నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సోమవారం విస్తృతంగా పర్యటించారు. పాతబస్తీలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. చార్మినార్‌ జోన్‌లో ఎమ్మెల్యే, జోనల్‌ కమిషనర్‌తో కలిసి చెరువులు, నాలాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మొదట మీరాలం ట్యాంక్‌ను కార్పొరేటర్‌ మహమద్‌ ముబీన్‌తో కలిసి సందర్శించిన మేయర్‌.. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలలో చెత్త వేయకుండా నాలాకు ఇరువైపులా రేకులు నిర్మించాలని జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌కు సూచించారు. రాజేంద్రనగర్‌లోని పల్లె చెరువు వద్దకు వెళ్లిన మేయర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం హెచ్‌ఎండీఏ అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫలక్‌నుమా బ్రిడ్జ్‌ పనులను పరిశీలించిన మేయర్‌ నాలా పనులను, బ్రిడ్జ్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఒవైసీ హాస్పిటల్‌ వద్ద జరుగుతున్న ఫ్లై ఓవర్‌ పనులను పరిశీలించిన మేయర్‌.. పనులు ఆలస్యం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులలో వేగం పెంచాలని చీఫ్‌ ఇంజనీర్‌ సురేష్‌ను ఆదేశించారు. యాకుత్‌పురా నాలాను ఎమ్మెల్యే పాషాఖాద్రీతో కలిసి సందర్శించిన మేయర్‌ రోడ్లపై చెత్త లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం, డబీర్‌పురా నాలా సుందరీకణ పనులను పరిశీలించారు. నాలా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని, రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పద్మానగర్‌, అశోక్‌ నగర్‌, ఏసీటీసీ కాలనీలలో నాలా పూడీకతీత పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

ట్రెండింగ్‌

Advertisement