e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీలో.. మాయాజాలం

మార్కెట్‌ కమిటీలో.. మాయాజాలం

మార్కెట్‌ కమిటీలో.. మాయాజాలం
  • లైసెన్స్‌ల జారీలో అవినీతి నేపథ్యంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ సూపర్‌వైజర్‌ సస్పెన్షన్‌
  • త్వరలోనే మరికొందరిపై వేటు..
  • పాలకవర్గంపై కూడా ఆరా..

ఎల్బీనగర్‌, జూన్‌ 6: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో అక్రమంగా లైసెన్స్‌ల జారీ పక్రియలో మార్కెటింగ్‌ శాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. లైసెన్స్‌ అనుమతిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా స్పష్టం అవుతున్న నేపథ్యంలో మార్కెట్‌ కమిటీ అధికారులతో పాటుగా పాలకవర్గంలోని కొందరి తీరుపై, వారి వ్యవహారంపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ ఎస్‌జీఎస్‌ను కేంద్ర కార్యాలయానికి ఆటాచ్‌ చేసిన ఉన్నతాధికారులు, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో లైసెన్స్‌ల జారీ పక్రియను పర్యవేక్షించే సూపర్‌వైజర్‌ను సస్పెండ్‌ చేశారు. అంతేకాక ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారానికి మూలకారణమైన పాలకవర్గంలోని కొందరు వ్యక్తులపై కూడా వారు విచారణ చేయడంతో పాటు వారి తీరుపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అదనంగా లైసెన్స్‌ల జారీ వ్యవహారంలో మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు అనుమతులు తీసుకోకుండానే కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జారీ చేసిన లైసెన్స్‌లను రద్దు చేయాలని, అందు కోసం పాలకవర్గ సమావేశం నిర్వహించేందుకు సభ్యులు ఉద్యుక్తులు అవుతుండగా, ఈ విషయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాత్రం సమావేశం పెట్టేందుకు ససేమిరా అంటూ మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ల వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు స్పష్టం అవుతున్న నేపథ్యంలో ఎవరెవరికీ ఎన్ని లైసెన్స్‌లు జారీ చేశారన్న వివరాలను కూడా అధికారులు తెక్క తేల్చుతున్నట్లు తెలుస్తోంది. గడ్డిఅన్నారం పాలకవర్గ సభ్యులు మాత్రం లైసెన్స్‌ల జారీ విషయంలో తాము తీర్మానం చేయలేదని స్పష్టంగా చెబుతుండగా, కొందరు మాత్రం తీర్మానం అయ్యిందంటూ దాట వేస్తున్నారు. ఈ వ్యవహారం ఎవరి పదవికి గండం తెస్తుందోననే ఊహగానాలు విన్పిస్తున్నాయి.

97 లైసెన్స్‌ల రెన్యూవల్‌లోనూ..

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో గతంలో రద్దు చేసిన 97 లైసెన్స్‌ల వ్యవహరంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరినట్లు వదంతులు ఉన్నాయి. గతంలో ఈ 97 షాపుల నుంచి మార్కెట్‌ కమిటీకి రావాల్సిన బకాయీలను మినహాయించినందుకు పాలకవర్గంలోని కొందరు వ్యక్తులు, మార్కెట్‌ కమిటీ అధికారులు రెన్యూవల్‌ సమయంలో ఒక్కో లైసెన్స్‌కు రూ.1 కంటే ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కూడా మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మార్కెట్‌ కమిటీలో.. మాయాజాలం

ట్రెండింగ్‌

Advertisement