ఉచిత నీరు.. ఇదిగో చూడు

- నెల రోజుల్లోనే నెరవేరిన హామీ
- అమల్లోకి 20వేల లీటర్లఉచిత మంచినీటి పథకం
- జూబ్లీహిల్స్లోప్రారంభించిన మంత్రి కేటీఆర్
- అతివల్లో వెల్లువిరిసిన ఆనందం
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం గ్రేటర్ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం ప్రారంభమైంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్‌లోని ఎస్పీఆర్హిల్స్లో ప్రారంభించారు. గృహ వినియోగదారులకు నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తారు. ఆపైన వాడితే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో ఈ లెక్కన 97 శాతం కుటుంబాలు ఉచిత పథకం వల్ల లబ్ధి పొందనున్నాయి. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ఎంతో మేలు జరుగుతుంది. ముందే ప్రకటించిన విధంగా ఈనెల (జనవరి)లో జారీచేసే డిసెంబరు బిల్లు నుంచే ఉచిత పథకం ఆమల్లోకి వస్తున్నది. 2020 డిసెంబరు మాసానికి 20వేల లీటర్ల వరకు నీటిని వాడుకున్న వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఉచిత తాగునీటి పథకం పొందాలంటే నల్లా కనెక్షన్‌కు మీటర్ తప్పనిసరి. బస్తీల్లో నివసించే వారికి ఎలాంటి మీటరు అమర్చుకోవాల్సిన అవసరం లేదు. ఉచిత తాగునీటి పథకం ఇప్పటికే ఢిల్లీలో అమలవుతుండగా, రెండోది నగరంలోనే.
అన్నమాట నిలబెట్టుకుండ్రు
గ్రేటర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాకు ఆనందాన్ని పంచారు. నాకు 70 ఏండ్లు. మంచినీళ్లకు మస్తు గోసపడినం. తెలంగాణ వచ్చినాక ఆ బాధలు పూర్తిగా పోయినయి.
నీళ్ల కష్టాలు పోయినయి
టీఆర్ఎస్ సర్కారు రాకముందు మంచినీళ్లకు చాలా కష్టాలు పడేటోళ్లం. ప్రభుత్వం ఉచితంగా మంచినీళ్లు ఇస్తుండడంతో సంతోషంగా ఉన్నది. పేదలు నీటి కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే భారం భరించడం చాలా స్ఫూర్తిదాయకం. ఉచిత మంచినీటి పథకం పూర్తి భరోసానిచ్చింది. -లక్ష్మి ,ఎర్రగడ్డ
రెండు రోజుల ముందే మహానగర ప్రజలకు సంక్రాంతి పండుగ వచ్చింది. మాట తప్పని.. మడమ తిప్పని ప్రభుత్వమని టీఆర్ఎస్ సర్కార్ మరోమారు నిరూపించుకున్నది. మొన్నటికి మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీనీ ఆర్థిక సంక్షోభంలోనూ.. నెల రోజులకే నెరవేరుస్తూ.. ప్రజలపై తమకున్న నిబద్దతను చాటుకున్నారు. అత్యంత ప్రధానమైన ఉచిత తాగునీటి పథకం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. సంక్రాంతి కానుకగా.. ప్రతి ఇంటికి 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టడంతో మహిళల మోములో ఆనందం వెల్లువిరిసింది. ఇందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ వేదికైంది. సమైఖ్య రాష్ట్రంలో గుక్కెడు నీటిని సైతం కొనుక్కోవల్సిన పరిస్థితి నుంచి నేడు ఉచితంగా నీటిని అందజేసే స్థితికి ఎదిగినందుకు సంతోషంగా ఉందని నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేదల దాహం తీర్చేందుకు ఇంతటి బృహత్తర పథకాన్ని అమలు పరిచిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా జనవరిలో జారీ చేసే డిసెంబరు బిల్లు నుంచే ఈ ఉచిత పథకం ఆమల్లోకి వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2020 డిసెంబరు మాసానికి సంబంధించి 20వేల లీటర్ల వరకు నీటిని వాడుకున్న వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఉచిత తాగునీటి సౌకర్యాన్ని పొందాలంటే వారు తమ కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్లమ్‌లలో నివసించే వారు ఎలాంటి మీటరు అమర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వారానికోసారి నల్లానీరు వదిలేది. పట్టుమని పదినిమిషాలు రాకముందే బందయ్యేది. ఆ పదినిమిషాల నీటికోసం డ్యూటీలకు డుమ్మా కొట్టి రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా ఎదురు చూశాం. వచ్చే
లో ప్రెషర్‌తో గంటల తరబడి నిలబడి ట్యాంకుల్లోకి క్యాన్లు వదిలితే.. పట్టుమని నాలుగు బిందెలు నిండేది కాదు. వచ్చిన నీటినే తలాకొన్ని పంచుకునేది. 15 రోజులకో మారు వచ్చే ట్యాంకర్ల వద్ద శికపట్లు పట్టాం. స్నానం చేయాలంటే మమా అనిపించేది. సమైక్య రాష్ట్రంలో ఇబ్బందులు పడిన ఆ రోజులు గుర్తుకువస్తేనే కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి. స్వరాష్ట్రంలో అంతా మారిపోయింది. నాడు ఇన్ని ఇబ్బందులు పడి నేడు ఉచితంగా నీరు పొందుతున్నామంటే.. అది సీఎం కేసీఆర్ పుణ్యమే. నిజంగా ఆయన దేవుడే. రూపాయికే కనెక్షన్ ఇచ్చారు. ఇంటింటికీ నల్లా వచ్చింది. రోజువిడిచి రోజు కావాల్సినన్ని నీరు లో ప్రెషర్ లేకుండా వస్తున్నాయి.
- బోర్లు తవ్వించాల్సిన అవసరం లేకుండా పోయింది. మోటార్లు మూలన పడ్డాయి. పేదల కోసం
- ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మహిళలు ఆనంద బాష్పాలు చిందిస్తూ.. సంబురపడిపోయారు.
పేదల అవసరం తీర్చారు
సీఎం కేసీఆర్ పేదల అవసరాలను గుర్తించడమే కాకుండా ఎన్నికల్లో చెప్పినట్లు ఉచితంగా మంచినీరు అందజేయడం సంతోషంగా ఉన్నది. ఇప్పటికే పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు ఇంట్లో ఒక్కరికి ఆరు కిలోలు చొప్పున రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నారు. ఇప్పుడు తాగడానికి ఉచితంగా మంచినీరు అందజేస్తున్నారు. పేదలకు ఏం కావాలో తెలుసుకొని అందించే ముఖ్యమంత్రి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. - ఎల్లమ్మ, మహాత్మానగర్, రహమత్‌నగర్
పేదలకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం 20వేల లీటర్లలోపు ఉచితంగా తాగునీరు ఇవ్వడం ఆనందాన్నిస్తుంది. గతంలో గుక్కెడు నీటికోసం ఎన్నో కష్టాలు పడేది. డబ్బులు పెట్టి కొనుక్కునేది. నీళ్లుంటే ఇంట్లో సంతోషమే వేరు. సీఎం కేసీఆర్ తాగునీరు ఉచితంగా ఇవ్వడంతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. -స్రవంతి, బ్రహ్మశంకర్‌నగర్, కార్మికనగర్
క్షీరాభిషేకం
బేగంపేట్ జనవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసినందుకు గాను రాంగోపాల్‌పేట డివిజన్ విక్టోరియా గంజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చిత్ర పటాలకు బస్తీ వాసులు క్షీరాభిషేకం చేశారు. కార్పొరేటర్ అరుణ, బస్తీ వాసులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ నిర్మించండి..మంత్రి కేటీఆర్‌కు డిప్యూటీ మేయర్ వినతి
ఎర్రగడ్డ : జుబ్లీహిల్స్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో మంత్రి కేటీఆర్‌కు డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్ వినతి పత్రం అందజేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.8.50కోట్ల ప్రాథమిక అంచనా వ్యయం అవుతుందని జలమండలి అధికారి ద్వారా తెలుసుకున్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్య , రాజ్‌కుమార్ పటేల్ ఉన్నారు.
తాజావార్తలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు