e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News మృత‌దేహాల త‌ర‌లింపున‌కు ఉచితంగా వాహ‌నాలు : జీహెచ్ఎంసీ

మృత‌దేహాల త‌ర‌లింపున‌కు ఉచితంగా వాహ‌నాలు : జీహెచ్ఎంసీ

మృత‌దేహాల త‌ర‌లింపున‌కు ఉచితంగా వాహ‌నాలు : జీహెచ్ఎంసీ

హైద‌రాబాద్ : ఖ‌ర్చు లేకుండా అంతిమ‌యాత్ర చేయాల‌ని బ‌ల్దియా నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ మృత‌దేహాల త‌ర‌లింపున‌కు ఉచితంగా వాహ‌నాలు ఇవ్వ‌నుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు జీహెచ్ఎంసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 6 జోన్ల‌కు 14 వాహ‌నాలను కేటాయించింది. వాహ‌నాల నిర్వ‌హ‌ణ‌కు ఒక్కో జోన్‌కి ఇద్ద‌రు అధికారులను కేటాయించింది.

పుర‌పాల‌క‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అరవింద్ కుమార్ సోమ‌వారం నాడు న‌గ‌రంలోని ప‌లు స్మ‌శాన‌వాటిక‌ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌భుత్వం సూచించిన ధ‌ర‌ల ప్ర‌కారం కాకుండా ప్ర‌జ‌ల నుండి ఎక్కువ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారా అని ప‌రిశీలించారు. పంజాగుట్ట‌, బ‌న్సీలాల్‌పేట‌, జూబ్లీహిల్స్‌లోని స్మ‌శాన‌వాటిక‌ల‌ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. క‌ట్టెల‌తో ద‌హ‌న సంస్కారానికి రూ. 8 వేలు, ఎలక్ట్రిక్ క్రిమియేష‌న్‌కి రూ. 4 వేలు మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మృత‌దేహాల త‌ర‌లింపున‌కు ఉచితంగా వాహ‌నాలు : జీహెచ్ఎంసీ

ట్రెండింగ్‌

Advertisement