గురువారం 28 మే 2020
Hyderabad - Apr 02, 2020 , 23:38:05

ఆపత్కాలంలో అండగా...

ఆపత్కాలంలో అండగా...

 • వేదాన్ష్‌ అప్లికేషన్స్‌ ప్రై.లి. (టేకా) పేరిట యువకులు ప్రత్యేక యాప్‌ను రూపొం దించి  రోజూ 2వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. 
 • మేడ్చల్‌ టీఆర్‌ఎస్వీ కో-ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో 100 కిలోల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
 • కింగ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ నజీర్‌ ఖాన్‌, ఆయన సోదరులు మహ్మద్‌ జుబైర్‌, షఫీలు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • ఐవా ఆధ్వర్యంలో బౌరంపేట వీఎన్‌ఆర్‌ ఆశ్రమంలోని 70 మంది వృద్ధులకు అన్నదానం చేశారు.
 • రామానుజన్‌ ట్రస్టు సహకారంతో హెచ్‌బీకాలనీలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి నిత్యావసర వస్తువులు అందించారు.
 • బొంతు ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీదేవి చర్లపల్లిలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
 • జూబ్లీహిల్స్‌లో విద్యుత్‌ ఉద్యోగులు పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు.
 • బీఎంఎస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మల్కాజిగిరిలో సరుకులు అందజేశారు.
 • బీహెచ్‌ఈఎల్‌ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం చేశారు.


 • చర్లపల్లిలో కేసీఆర్‌ సేవా సమితి అధ్యక్షుడు బాల్‌రెడ్డి సరుకులు అందించారు.
 • ఉప్పల్‌ ప్రశాంతినగర్‌కు చెందిన సైంటిస్ట్‌ రమణ, మన్నె నర్సింహారెడ్డి  పేద కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు.
 • ఫ్రీ మాట్రిస్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో 150 మంది ఆటో కార్మికులకు ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు, ఏసీపీ ఎన్‌ఎల్‌ఎన్‌.రాజు సరుకులు అందించారు.
 • హబ్సిగూడలో సంజయ్‌జైన్‌ వంద మందికి నిత్యావసరాలు అందజేశారు.
 • వెంకట్‌రెడ్డినగర్‌లో రామాంజనేయ సేవాసమితి, సుప్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సాయికిరణ్‌లు సరుకులు పంపిణీ చేశారు.
 • కుత్బుల్లాపూర్‌లో రేషన్‌ బియ్యం పంపిణీని ఎమ్మెల్యే వివేకానంద్‌ ప్రారంభించారు.
 • గండిమైసమ్మ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 800 మందికి అన్నదానం చేశారు. 
 • కుత్బుల్లాపూర్‌ మాజీ ఎంపీపీ  సన్న కవిత పేదలకు బియ్యం పంపిణీ చేశారు.
 • ఆల్విన్‌ కాలనీ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో  200 కూలీలకు ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు.
 • బంజారాహిల్స్‌లో  ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కూలీలకు కార్పొరేటర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు.
 • బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌  కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు
 • దిల్‌సుఖ్‌నగర్‌లో 250 కుటుంబాలకు జి.రమేశ్‌ సరుకులు అందించారు.
 • బ్లడ్‌ డోనర్‌ లైఫ్‌ సేవర్‌ ఫౌండేషన్‌ 116 కుటుంబాలకు  సరుకులు అందించింది.
 • నాగోలు బీజేపీ డివిజన్‌ ఇన్‌చార్జి కందికంటి కన్నాగౌడ్‌ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు పేరాల శేఖర్‌రావు అన్నదానం చేశారు.
 • ముంబైకి చెందిన సుశీల్‌ మచ్చింద్ర తాను హైదరాబాద్‌లో చిక్కుకొని  ఇబ్బంది పడుతున్నానని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ట్వీట్‌ చేశాడు. కవిత ఆదేశాల మేరకు మియాపూర్‌కు చెందిన జాగృతి వేణుగోపాల్‌రావు నిత్యావసర వస్తువులను సుశీల్‌ మచ్చింద్రకు అందజేశారు.
 • ఆనంద్‌నగర్‌ చౌరస్తాలో వై.సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
 • నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • గుడిమల్కాపూర్‌లో టీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సంజయ్‌లు కూరగాయాలు పంపిణీ  చేశారు.
 • బేగంబజార్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రమేశ్‌లాల్‌ అన్నదానం చేశారు.
 • గౌలిగూడలో పవన్‌వర్మ పేదలకు బియ్యం అందజేశారు.
 • పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డికి మేడిపల్లి ఏవీ ఇన్ఫోప్రైడ్‌కు చెందిన తాడూరి నారాయణరెడ్డి రూ.లక్ష విరాళం అందించారు.
 • మేడిపల్లికి చెందిన బిల్డర్‌ రమణారెడ్డి రూ.20 వేలు, పీర్జాదిగూడకు చెందిన బీపీఆర్‌ శర్మ 50 కిలోల బియ్యం, పీర్జాదిగూడకు చెందిన కృష్ణంరాజు రూ. 25 వేలు, బుద్ధానగర్‌కు చెందిన రాజారాజు రూ.20 వేలు విరాళం ఇచ్చారు. 
 • భోగారం కో ఆప్షన్‌ సభ్యుడు డబ్బి నర్సింహారెడ్డి వలస కూలీలకు 100 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
 • తుర్కపల్లిలోని సేవ్‌ ఆల్‌ రీచ్‌ఆల్‌ సొసైటీ అనాథాశ్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.గోవర్ధన్‌ క్వింటాలు బియ్యం అందించారు.
 • బీజేపీ మాజీ అధ్యక్షుడు కే.లక్ష్మణ్‌ భోలక్‌పూర్‌లో బియ్యం పంపిణీ  చేశారు
 • బోడుప్పల్‌ పరిధిలోని జర్నలిస్టులు, దివ్యాంగులకు  మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి,  మేయర్‌ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సరుకులు అందించారు.
 • ఉప్పల్‌ బిల్డర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సింగిరెడ్డి పద్మారెడ్డి, ఎంపాల పద్మారెడ్డి ఆధ్వర్యంలో సరుకులు అందించారు.
 • చిత్రపురికాలనీలో పేదలకు 12 కిలోల ఉచిత బియ్యం, రూ.500 నగదు పంపిణీని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ ప్రారంభించారు.
 • యాప్రాల్‌లో కూలీలకు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
 • నల్లకుంట టీఆర్‌ఎస్‌ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్‌ 300 మందికి ఆహార పొట్లాలు, బియ్యం పంపిణీ చేశారు.


logo