కాచిగూడ,ఆగస్టు 25 : మహిళలు కరాటేను నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు కరాటే అవశ్యకతను వివరిస్తూ వారికి అవసరమైన మెలకువలను నేర్పించి వారు స్వయంగా తమను తాము రక్షించుకోవడానికి అవవరమైన శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు.
ఆత్మరక్షణ కోసం మహిళలు కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని, ఉద్యోగంతో పాటు మహిళలు కరాటేనే అభ్యసించడం ఎంతో అవసరమని ఆయన సూచించారు. కరాటే శిక్షణ పోందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత కరాటే శిక్షణ కోసం 9494112424లో సంప్రదించవచ్చును.