కంటోన్మెంట్, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు వసతి ఏర్పాటు చేయనున్నట్లు ఫౌండేషన్ సమన్వయకర్త భాస్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షలకు హాజరు కావాలనుకున్న వారు ఈనెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 17న ఆలేరు, 18న సంగారెడ్డిలో అర్హత పరీక్షను నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌లో ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. దరఖాస్తులను 9542433427 వాట్సాప్ నంబర్‌తో పాటు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.