60 ఏండ్లు పైబడి ఎలాంటి రవాణా వసతి లేని వారికి కరోనా టీకా వేసుకునేందుకు ఉచిత క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు హెల్పేజ్ ఇండియా సంస్థ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్నవారు 18001801253 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని, వ్యాక్సిన్‌కు తీసుకెళ్లి, తిరిగి ఇంటి వద్ద దించుతారని సంస్థ కో ఆర్డినేటర్ కళాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత సౌకర్యం నేటి నుంచి ఆర్నెళ్ల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.