ఆదివారం 31 మే 2020
Hyderabad - May 24, 2020 , 02:12:41

ప్రేమిస్తున్నాను..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు...

ప్రేమిస్తున్నాను..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు...

ఖైరతాబాద్‌ : ప్రేమిస్తున్నాను..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు...శారీరకంగా లొంగదీసుకున్నాడు... గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వగానే.... నీవు నాకొద్దన్నాడు... దీంతో మోసపోయిన బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బోరబండలోని నవోదయనగర్‌, ఎస్పీఆర్‌హిల్స్‌లో నివాసం ఉండే యువతి (20) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నది. గత రెండేండ్ల క్రితం వారి కుటుంబ ం ఎంఎస్‌ మక్తాలో ఉన్న క్రమంలో .. అదే ప్రాంతానికి చెందిన తండా ప్రశాంత్‌ (23)తో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తర్వాత ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మిన సదరు యువతి ... అతనితో కలిసి పార్కులు, సినిమాలకు తిరిగింది.

 ప్రశాంత్‌.. యువతిని తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడు. అదే క్రమంలో వారు శారీరక సంబంధం పెట్టుకోగా, గత ఏడాది గర్భం దాల్చగా, ఈ ఏడాది మార్చి 21న నిలోఫర్‌ దవాఖానలో మగ శిశువుకు జన్మనిచ్చింది. నాటి నుంచి పెండ్లి చేసుకోమని కోరుతుంటే దాట వేస్తూ వస్తున్నాడు. పుట్టిన బిడ్డకు తనకు ఎ లాంటి సంబంధం లేదని తప్పించుకుంటూ వస్తున్నాడు. తల్లిదండ్రులు లేని ఆ యువతి ప్రస్తుతం సోదరుడితో కలిసి నివసిస్తున్నది. తనను మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


logo