e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు లాభాలిస్తాం

పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు లాభాలిస్తాం

పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు లాభాలిస్తాం

సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్‌ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ప్రతి రోజూ 40 మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా.. అందులో 10 మందికి సంబంధించిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి.. మంగళవారం కూడా పలువురు బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘటనలు ఇలా..

  • ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆన్‌లైన్‌లో పెట్టుబడులకు సంబంధించిన అంశంపై పరిశీలించాడు. ఆ క్రమంలో ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెం ట్‌ చేయండంటూ గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్‌ చేశారు. మీరు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ నమ్మించగా..  అతడు రూ. 2 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. డబ్బు పెట్టుబడి పెట్టగానే నిందితులు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో, ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  • క్రెడిట్‌ కార్డు అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు.. అమీర్‌పేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 1.04 లక్షలు కాజేశారు.  మరో ఘటనలో రూ. 90 వేలు, ఇంకో ఘటనలో రూ. 60 వేలు బాధితుల వద్ద నుంచి కొట్టేశారు. 
  • అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. గోల్కొండకు చెందిన ఓ యువకుడికి రూ. 1.6 లక్షలు మోసం చేశారు. 
  • బేగంబజార్‌కు చెందిన ఒక వృద్ధుడికి ఫేస్‌బుక్‌లో ఒక యువతి పరిచయం అయ్యింది. తాను విదేశాల్లో ఉంటున్నానంటూ నమ్మిస్తూ కొన్నాళ్లు వాట్సాప్‌లో మాట్లాడుకున్నారు. మీ కోసం మంచి బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించి,  ఆ తరువాత ఎయిర్‌ పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులం మాట్లాడుతున్నామంటూ నమ్మించి రూ. 1.36 లక్షలను సైబర్‌నేరగాళ్లు వసూలు చేశారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు లాభాలిస్తాం

ట్రెండింగ్‌

Advertisement