శనివారం 04 జూలై 2020
Hyderabad - Jun 02, 2020 , 05:06:12

‘డబుల్‌' ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసం

‘డబుల్‌' ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసం

ఉప్పల్‌: డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ.. అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని ఉప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడినుంచి నకిలీ డబుల్‌ బెడ్‌రూం అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాఫీలు, రూ.38వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.సీఐ రంగస్వామి కథనం ప్రకారం... రామంతాపూర్‌ వివేక్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌(48) ఆటోడ్రైవర్‌. ఇతని స్నేహితులు శశికాంత్‌, మోహన్‌లు రామంతాపూర్‌, వెంకట్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు.కాగా.. ఈ ముగ్గు రు సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. ఈమేరకు అమాయక ప్రజలను గుర్తించి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి.. డబ్బులు వసూలు చేశారు.

ఈ విధంగా రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన లక్ష్మిని నమ్మించి లక్ష రూపాయలు వ సూలు చేశారు. అనంతరం వారు నకిలీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల అలాట్‌మెంట్‌ చేసినట్లు ఆర్డర్‌ను సృష్టించారు. అయితే ఆమెకు అనుమానం వచ్చి.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు చూపించాలని, లేదా నగదు రిటర్న్‌ ఇవ్వాలని లక్ష్మి కోరింది. దీనితో దాటవేస్తూ, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకటేశ్‌ను సోమవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 


logo