e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home హైదరాబాద్‌ ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌.. బహుమతంటూ ఎర

ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌.. బహుమతంటూ ఎర

బిజినెస్‌ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్‌ను సోమవారం రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన క్రిస్టోఫర్‌ 2010లో ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత కర్నాటకకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని పశ్చిమ ఢిల్లీలో ఉంటూ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతడి దుకాణానికి నైజీరియన్‌లు వచ్చి పీఓఎస్‌ మెషిన్‌ నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ చేసుకుని క్రిస్టోఫర్‌కు 5 శాతం కమీషన్‌ ఇచ్చేవారు. ఇది ఎలా సాధ్యమని తెలుసుకుని.. తానే స్వయంగా సైబర్‌ మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ , తదితర సోషల్‌ మీడియా వేదికల మీద పరిచయం చేసుకుని.. వారికి ఖరీదైన బహుమతులు పంపిస్తానని చెప్పి.. ఆ తర్వాత కస్టమ్స్‌ అధికారులుగా ఫోన్‌లో మాట్లాడి బాధితుల నుంచి లక్షలు గుంజాడు. ఈ విధంగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన ఇద్దరిని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదులతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో క్రిస్టోఫర్‌ను గుర్తించి ఢిల్లీలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌ వారెంట్‌ మీద సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌ తరలించారు.

ల్యాప్‌టాప్‌, ఐ ఫోన్‌లంటూ బురిడీ

చౌటుప్పల్‌కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్‌ ద్వారా క్రిస్టోఫర్‌ పరిచయం అయ్యాడు. చాటింగ్‌లో ఇద్దరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో మన స్నేహానికి గుర్తుగా ల్యాప్‌టాప్‌, ఐ ఫోన్‌లను పంపిస్తున్నానని చెప్పాడు. దీంతో బాధితుడు ఆసక్తిగా ఎదురుచూశాడు. బహుమతికి బదులుగా కస్టమ్స్‌ అధికారులమని ఫోన్‌ వచ్చింది. బహుమతికి ఆశపడి వారి చెప్పిన చార్జీలకు దాదాపు. 1.62 లక్షలను కట్టి మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు.

లక్కీ లాటరీ అంటూ.. రూ.5లక్షలు కాజేశారు

టెలికాం కంపెనీకి చెందిన లక్కీ లాటరీలో కారు గెలుచుకున్నారంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు.. ఓ మహిళకు రూ.5లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నంకు చెందిన ఓ మహిళకు.. టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. కంపె నీ తీసిన లక్కీ లాటరీలో మీరు కారు గెలుచుకున్నారని నమ్మించారు.. కారు అయినా తీసుకోవచ్చు లేదా దాని విలువ మార్కెట్లో రూ.12లక్షల వరకు ఉంటుంది, ఆ డబ్బునైనా తీసుకోవచ్చని నమ్మించారు. లాటరీ తీసుకోవడానికి ముందు కొంత ప్రాసెసింగ్‌ ఫీ చెల్లించాలని, బ్యాంకింగ్‌ ఫీజులు, ఆదాయపన్ను, జీఎస్టీ ఇలా పలురకాల పన్నులు చెల్లించాలని సూచిస్తూ బాధితురాలి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ కారు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మీ ప్రార్థనతో.. పదోన్నతి వచ్చిందంటూ..

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించిన క్రిస్టోఫర్‌ అందులో రోజ్‌ విల్సన్‌ 10 అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. ఈ ఐడీ ద్వారా వచ్చిన రిక్వెస్ట్‌కు ఇబ్రహీం పట్నంకు చెందిన ఓ యువతి స్పందించింది. దీంతో క్రిస్టోఫర్‌ అమ్మాయిగా మాట్లాడుతూ.. తాను మెక్సికోలో ఉంటానని.. మంచి ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. చాటింగ్‌లో స్నేహం బాగా పెరగడంతో ఓ రోజు యువతిని నీ మనస్సు చాలా మంచిది.. మీరు నాకు మరింత ఉన్నత పదోన్నతి కలగాలని ప్రార్థన చేయాలని సూచించగా.. అలాగే చేసింది.. రెండు రోజుల తర్వాత నీ ప్రార్థనతో నాకు పదోన్నతి వచ్చింది.. కావునా నీకు ఖరీదైన బహుమతితో పాటు 3 లక్షల యూకే పౌండ్‌లను పంపిస్తున్నానని నమ్మించాడు. సంతోషంతో బహుమతి కోసం ఎదురు చూస్తుండగా.. కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ వచ్చింది.. మీ పేరుమీద భారీ బహుమతి వచ్చింది. దాం ట్లో విదేశీ కరెన్సీ ఉంది.. ఇది అక్రమమంటూ బెదిరించారు. ఈ బహుమతి కావాలంటే కొన్ని చార్జీలు కడితే సరిపోతుందన్నారు. అలా బాధితురాలి నుంచి రూ.3 లక్షలను కాజేశాడు.. ఇది మోసమని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

Advertisement
ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌.. బహుమతంటూ ఎర

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement