e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ మాటలే పెట్టుబడిగా మోసాలు..

మాటలే పెట్టుబడిగా మోసాలు..

మాటలే పెట్టుబడిగా మోసాలు..

వ్యక్తిగత కార్యదర్శులమంటూ మాయ..
తక్కువ ధరకే భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ
మోసపోతున్నవారిలో ఉన్నత విద్యావంతులు, ప్రజాప్రతినిధులు

మాటలే పెట్టుబడిగా.. నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.. ఇందుకు ఉన్నత స్థాయిలో పనిచేసేవారి వద్ద వ్యక్తిగత కా ర్యదర్శులమంటూ చెప్పుకుంటూ మాయచేస్తున్నారు. అ యితే.. ఇందులో మోసపోతున్నవారిలో బాగా చదువుకున్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఉండటం గమనార్హం. తక్కు వ ధరకే స్థలాలు వస్తున్నాయి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పగానే నమ్మి లక్షలు సమర్పిస్తున్నారు. ఇటీవల సీఎం ఓఎస్డీ పీఏ నంటూ సుధాకర్‌ అనే వ్యక్తి ఉన్నత చదువులు చదివిన వారినే లక్ష్యంగా చేసుకొని మోసాలు చేశాడు. బడా వ్యాపారులు సైతం ఇలాంటి నేరగాళ్ల చేతిలో చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు.. అయితే చాలా మంది పరువు పోతుందని పోలీసులకు కూడా చె ప్పడానికి వెనుకాడుతున్నారు. దీన్నే అవకాశంగా చేసుకు న్న కొందరు చీటింగ్‌కు పాల్పడుతున్నారు.

ఓఎస్డీ పీఏనంటూ..

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓఎస్డీ పీఏనంటూ మాటలతో మాయ చేస్తూ అమాయకులను మో సం చేస్తున్న ఒక ఘరానా మోసగాడిని, అతడి ఇద్దరు సహాయకులను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ. 2.2 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. పెద్దపల్లి జిల్లా కల్వా శ్రీరాంపురం మండలం, తార్‌పల్లి గ్రామానికి చెందిన అవుసోదపు సుధాకర్‌ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తూ, కాప్రాలోని ఎల్లారెడ్డిగూడ గౌరినాథపురంలో నివాసముంటున్నాడు. రాష్ట్ర సచివాలయంలో డ్రైవర్‌గా పనిచేశాడు. విలాసవంత జీవనం గడపడానికి ఉద్యోగి అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలు చేశాడు.

ప్రజాప్రతినిధులకే టోకరా..

ఈస్ట్‌గోదావరి జిల్లా కిర్లంపుడికి చెందిన తోట బాలాజీనాయకుడు అలియాస్‌ నాయుడు, మనోహర్‌, లక్ష్మణ్‌, మహేశ్‌ తదితర పేర్లతో.. తనకు తానుగా పరిస్థితులను బట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లలో పనిచేస్తున్నానని అందరినీ నమ్మించాడు.. 2017లో ఓ ఎమ్మెల్సీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2 కోట్ల డెవలప్‌మెంట్‌ నిధులు ఇప్పిస్తానంటూ నమ్మించి, దాని పైరవీకి రూ. 10 లక్షలు ముందుగా ఇవ్వాలంటూ వసూలు చేశాడు. ఇతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మంత్రి వ్యక్తిగత కార్యదర్శినంటూ..

ఐటీ శాఖ మంత్రి కేటీర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ చెప్పుకుం టూ మోసాలకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెట్‌ ఆటగాడు బు డమూరు నాగరాజును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మార్చి లో అరెస్ట్‌ చేసి.. రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా , వయ్యారిపేటకు చెందిన నాగరాజు ఎంబీఏ చదివాడు. 2014-16 మధ్య కాలంలో ఆంధ్ర రంజీ జట్టులో ఆడాడు. కాగా .. ఈజీ మనీ కోసం ప్రముఖుల పేర్లు చెబుతూ వ్యాపారులను బురిడీ కొట్టిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. 2018 నుంచి ఇప్పటి వరకు ఇతడిపై ఆంధ్ర, తెలంగాణల్లో 19 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. నాగరాజు మోసగాడు అనే విషయం ప్రచారంలో ఉన్నా.. అతడి మాటలు నమ్మి పలువురు మోసపోయారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాటలే పెట్టుబడిగా మోసాలు..

ట్రెండింగ్‌

Advertisement