అతివేగానికి.. బలయ్యారు

- రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు
- తీవ్ర గాయాలతో వ్యక్తి దుర్మరణం
- అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద ఘటన
ఘట్కేసర్ రూరల్ : అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా.. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు కథనం ప్రకారం.. రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన పిడమర్తి సురేశ్(55) సోమవారం రాత్రి హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఘట్కేసర్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని 108లో ప్రైవేటు దవాఖానకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగానికి వెళ్తుండగా బస్సు ఢీకొని..
శామీర్‌పేట : ఉద్యోగానికి వెళ్తున్న వ్యక్తిని... అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేటు కంపెనీకి చెంది న బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగదేవ్‌పూర్ మండ లం, బొందుగుళ్లకు చెందిన అనిల్‌కుమార్(28)కు భార్య స్వప్న, 6 నెలల కొడుకు ఉన్నాడు. మూడుచింతల్‌పల్లి మండలం, కొల్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీఈ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉద్యోగానికి వెళ్తుండగా.. కొల్తూర్ గ్రామ సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన కర్కపట్ల జోదాస్ కంపెనీకి చెందిన బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో!?
- రైల్వే పనులు వేగంగా చేపట్టాలి : మంత్రి హరీశ్‌రావు
- ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
- పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన తేరా చిన్నపరెడ్డి
- ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి
- టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- భద్రతామండలిలో భారత్‌కు చోటుపై లిండా ఏమందంటే?!
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,