శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Hyderabad - Jul 04, 2020 , 00:10:39

భాగ్యనగరికి తీగల నగ

భాగ్యనగరికి తీగల నగ

నీలి ఆకాశంలో తెరలుతెరలుగా ఉన్న తెల్లని మబ్బులు.. అద్భుతమైన కట్టడాలు.. ఆకట్టుకుంటున్న పచ్చదనం.. వాహ్‌.. ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తుంటే.. ఇదేదో విదేశీ ప్రాంతానికి చెందినదిగా అనిపిస్తున్నదా..  అయితే మీరు పొరబడినట్లే..  ఇది ఎక్కడో కాదు.. మన హైదరాబాదే. దుర్గంచెరువు పరిసరాలు విశ్వనగరపు సొగసుతో ఇదిగో ఇలా మెరిసిపోతున్నది. ఇక్కడ నిర్మించిన తీగల వంతెన చారిత్రక నగరానికి మరింత  వన్నెలద్దింది.  ఏరియల్‌ వ్యూలో నలుదిక్కులూ అత్యంత సుందరంగా కనిపిస్తున్నది. చూసే వాళ్ల మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. అన్నట్లు ఈ కేబుల్‌ బ్రిడ్జి త్వరలోనే ప్రారంభం కానున్నది. దీనిపై నిర్వహించిన లోడ్‌ టెస్ట్‌ విజయవంతమైంది. ఈ నెలాఖరుకు బ్రిడ్జితో పాటు దీనికి  అనుబంధంగా నిర్మిస్తున్న జూబ్లీహిల్స్‌  రోడ్‌నం-45 ఫ్లైఓవర్‌ ప్రారంభించే అవకాశమున్నది.


logo