హైదరాబాద్ : హైదరాబాద్ నగర సమీపంలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. హిమాయత్ సాగర్‌లోకి 2,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762.40 అడుగులు. ఉస్మాన్ సాగర్‌లోకి 3,055 క్యూసెక్కుల వరదీ నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.35 అడుగులు.