శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 08:11:59

వరదల నష్టం రూ.670 కోట్లు

వరదల నష్టం రూ.670 కోట్లు

ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకుఎక్కువగా రోడ్లకు నష్టం జరిగింది. బీటీ రోడ్లు 146కిలోమీటర్లు, అలాగే సీసీ రోడ్లు 376 కిలోమీటర్లమేర పాడయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.522కోట్లు ఖర్చవుతుందని, మొత్తం అన్ని విభాగాలు కలిపి వరద మిగిల్చిన నష్టం రూ.670కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

  • ఆహార పొట్లాల సరఫరా, పునరావాస కేంద్రాలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, పునరావాస చర్యలకోసం అదనపు సిబ్బంది, యంత్రాలు, పారిశుధ్య డ్రైవ్‌, క్రిమిసంహారకాల పిచికారీ తదితర వాటికి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ రూ.45కోట్లు ఖర్చుచేసింది.
  • బీటీ రోడ్లు 445స్ట్రెచ్‌లలో మొత్తం 146.78కిలోమీటర్ల మేర నష్టం జరుగగా.. పునరుద్ధరణకు రూ.146కోట్లు ఖర్చవుతుంది.
  • సీసీ రోడ్లు 1211స్ట్రెచ్‌లలో 376.58కిలోమీటర్లు నష్టం వాటిళ్లగా.. వాటికి రూ.376కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.
  • వరదనీటి డ్రైన్‌లు, నాలాలు 101స్ట్రెచ్‌లలో నష్టం జరుగగా.. వీటికి రూ. 83కోట్లు ఖర్చుచేయాల్సి ఉంది.
  • చెరువులు, జలాశయాల పటిష్టతకు రూ.54.43కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
  • టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌- డీటీఆర్‌ఎస్‌ రిపేర్లు, 160డీఆర్‌ఎస్‌లు పెండింగ్‌. ఇప్పటివరకు వ్యయం రూ.కోటి ఖర్చుకానున్నాయి.
  • వాటర్‌బోర్డు- పంపులు, ఇతర పైప్‌లైన్లకు జరిగిన నష్టం రూ.45కోట్లు. ఇప్పటివరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. 
  • గత ఏడు రోజుల్లో 59శిథిల భవనాలు కూల్చివేయడంతోపాటు 33 భవనాలను ఖాళీ చేయించారు. వాటిలో ఉంటున్న 140మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 45ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహణ. 25ప్రాంతాల్లో ఇప్పటికే వ్యర్థాల తొలగించగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. 
  • ముంపునకు గురైన సెల్లార్లకు సంబంధించిన భవనాలను ఖాళీ చేయిస్తున్నారు. 84 భవనాలను గుర్తించగా అందులో 64భవనాల్లో రక్షణ చర్యలు తీసుకున్నారు. మిగిలిన 20భవనాలకు నోటీసులు జారీచేసి నీటిని తొలగించి రక్షణ చర్యలు పాటించాలని కోరారు.