బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు

బంజారాహిల్స్ : బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో అనర్హులకు ఫ్లాట్లు కేటాయించిన తెలుగు సినిమా అండ్ టీవీ, మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ ైస్టెలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడితో సహా పలువురిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ‘తెలుగు సినిమా అండ్ టీవీ, మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ ైస్టెలిస్ట్స్ యూనియన్' కొనసాగుతోంది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న 24 విభాగాలకు చెందిన కార్మికులతో పాటు టెక్నీషియన్ల సంక్షేమం కోసం చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల వివరాలను ఇవ్వాలని ఇటీవల యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్ చిత్రపురి హౌసింగ్ సొసైటీని కోరారు. దీంతో వారిచ్చిన జాబితాను పరిశీలించగా అందులో యూనియన్‌తో గానీ సినీ పరిశ్రమతో గానీ సంబంధం లేని పలువురికి ఫ్లాట్లు కేటాయించారని తేలింది.
తెలుగు సినిమా అండ్ టీవీ, మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ ైస్టెలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు జి. గురవారెడ్డితో పాటు మరికొంతమంది బోగస్ ఐడీ కార్డులను సృష్టించి.. చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు కేటాయించినట్లు తేలింది. అధ్యక్షుడు గురవారెడ్డి సతీమణి జి.హైమావతి, బంధువులు శివశంకర్‌రెడ్డి, కరణ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, చంద్రగోసు. పి.నరేశ్, ఎం.పద్మ, పార్థసారధి బట్టు, శ్రీదేవి గోసు, నిర్మల పిల్లా తదితరులు బోగస్ కార్డులతో ఫ్లాట్లు పొందారని, ఈ మొత్తం వ్యవహారంలో చిత్రపురి హౌసింగ్ సొసైటీ పాత్ర కూడా ఉన్నందున.. వారందరిపై చర్యలు తీసుకోవాలని శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన గురవారెడ్డి, చిత్రపురి సౌసైటీతో పాటు ఫ్లాట్లు పొందిన 10మందిమీద ఐపీసీ 420, 403, 500తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.