బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 08:45:09

నేటి నుంచి ఎన్టీఆర్‌ స్టేడియంలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

నేటి నుంచి ఎన్టీఆర్‌ స్టేడియంలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్ : ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్‌ హైదరాబాద్‌(అర్బన్‌) జిల్లా ఆధ్వర్యంలో నేటి ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఫిష్‌ఫుడ్‌ ఫెస్టివల్‌(చేపల వంటకాలు) నిర్వహిస్తున్నట్లు మహిళా మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు ఎం.అరుణ్‌జ్యోతి తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లో పోస్టర్లను సంఘంకార్యదర్శి పి.రజని, మహిళాసంఘం అధ్యక్షురాలు ఎం.చంద్రకళతో కలిసి ఆవిష్కరించారు. 

మహిళలు నిర్వహించే ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల చేపల వంటకాలను తయారు చేస్తారన్నారు. ఫిష్‌బి ర్యానీ, ఫ్రాన్స్‌ బిర్యానీ, జొన్నరొట్టె చేపల పులుసు, రాగిసంగటి చేపలపులుసు, కట్లెట్‌, లాలీపాప్‌, టిక్కా, దిల్‌ పసంద్‌, రోల్‌, సమోసా, బాల్స్‌, అపోలో, ఫింగర్‌ఫిష్‌తోపాటు ఫిష్‌ వడియాలు, జంతికలు, చపాతి, అప్పడాలు తదితర వంటకాలు నోరూరిస్తాయన్నారు. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు కొప్పు పద్మ, డైరెక్టర్లు కన్నం తులసి, కర్రెల్లి లలిత, బాద పద్మ, మెట్టు ప్రసాద్‌, చెర్క సంగీత, వీరబోయిన సబిత, మంగిలిపెల్లి రాజు, కాడబోయిన అరుణ, తుమ్మరి విజయ్‌కుమార్‌, పూస నాగమణి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఎం.సునీత, ఎం.మంజుల, సి.తులసి పాల్గొన్నారు.


logo