e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home హైదరాబాద్‌ ముందస్తు జాగ్రత్తలతోనేమేలు

ముందస్తు జాగ్రత్తలతోనేమేలు

ముందస్తు జాగ్రత్తలతోనేమేలు

ప్రమాదాల నివారణలో అదే ఉత్తమం
అగ్ని ప్రమాదాలపై అవగాహన
ముగియనున్న అగ్నిమాపక వారోత్సవాలు
ప్రమాదం సంభవిస్తే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి

కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్‌ 20 : ఇంట్లో, వంటింట్లో, పరిశ్రమలు, వైద్యశాలలు, షాపింగ్‌ మాల్స్‌లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఏర్పడే అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం, విలువై ప్రాణాలు హరించుకపోతాయి. చిన్న అగ్గిరవ్వతో సర్వస్వం బూడిదైపోతుంది. తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ప్రమాదాలను ఎదుర్కోవడం కంటే వాటిని నివారించడమే ఉత్తమమన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. షాపింగ్‌ మాల్స్‌, పరిశ్రమలు, అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు.. ప్రమాదం సంభవించిన వెంటనే ఏవిధంగా స్పందించాలన్న అంశాలపై మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తారు. ఈనెల 14న ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి.

- Advertisement -

ఇంట్లో.. ఇంట్లోని వస్తువులు అల్మార, సెల్ఫులను సక్రమంగా ఉంచుకోవాలి.
చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, ఇతర పేలుడు మందు పదార్థాలు అందుబాటులో ఉంచొద్దు.
ఐఎస్‌ఐ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలనే ఉపయోగించాలి.
పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌ లోడ్‌ లేకుండా చూసుకోవాలి.
ఎలక్ట్రికల్‌ సాకెట్‌నందు కెపాసిటికీ తగిన ప్లగ్‌లను మాత్రమే వాడాలి. ప్రమాదం సంభవిస్తే వెంటనే నీటితో ఆర్పేలా సిద్ధంగా ఉండాలి.
మీ దుస్తులకు నిప్పంటుకుంటే పరుగెత్తకుండా నేలపై దొర్లడం, దుప్పటి చుట్టుకోవాలి.
కాలిన శరీరం మీద చల్లటి నీరు పోయొద్దు. పొగతో నిండిన గదులలో నోటికి అడ్డంగా తడి గుడ్డనుంచి గాలి పీల్చాలి.
వైద్యశాలలో.. స్కూల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, వైద్యశాలలో ఆర్‌సీసీ, కాంక్రీట్‌ స్లాబ్‌లు మాత్రమే పై కప్పుగా ఉండాలి.
ఫైర్‌ అలారమ్‌, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లు అందుబాటులో పెట్టుకోవాలి.
సెల్లార్లలో ఆటోమెటిక్‌ స్పింక్లర్‌ ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునేలా ఏర్పాట్లు ఉండాలి.
ఉద్యోగులందరూ పరిశుభ్రతను పాటిస్తూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.
ప్రమాదాల నివారణకు ఉపయోగించే పరికరాలు, బేసిక్‌ ఫైర్‌ ఫైటింగ్‌లో శిక్షణ ఇవ్వాలి.
విద్యుత్‌ ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలి.
విద్యుత్‌తో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మెయిన్‌ స్విచ్‌ను ఆఫ్‌ చేయాలి.

వంటగదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వంట వండుతున్నప్పుడు వంట గదిని ఇడిచివెళ్లొద్దు.
మీ గ్యాస్‌ స్టవ్‌లో.. సిలిండర్‌లో.. రెగ్యులేటర్‌లో ఏదైనా ఇబ్బంది కలిగితే సొంతంగా రిపేర్‌ చేయకుండా గ్యాస్‌ డీలర్‌ను సంప్రదించాలి.
ట్యూబ్‌ చూసినప్పుడు ఏమాత్రం పొడి రాలినా.. చీలికలు కనబడినా వెంటనే ఐఎస్‌ఐ మార్కు గల రబ్బరు ట్యూబ్‌ను మార్చాలి.
ప్రతిరోజూ పడుకునేముందు రెగ్యులేటర్‌ను విధిగా ఆఫ్‌ చేయాలి.
వంట గదిలో రిఫ్రిజిరేటర్‌ ఉంచకూడదు.
ఇంటినుంచి బయటికి వెళ్లినప్పుడు గ్యాస్‌ రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి.
నూనె బానాలితో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే దానిని మూతతో కప్పివేయాలి.
స్టవ్‌ మీద వంటకు పెట్టి బయటకు వెళ్తే వండే పదార్థాలు పొంగి గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం జరుగొచ్చు.
గ్యాస్‌ లీక్‌తో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే రెగ్యులేటర్‌ను ఆపి ఎలక్ట్రికల్‌ స్విచ్‌లు ఆన్‌/ఆఫ్‌ చేయొద్దు.
గాలి వెలుతురు కోసం కిటికీలు దర్వాజలు తెరవాలి.
అవకాశముంటే తడి బట్టను, తడిసిన గోనెసంచిని సిలిండర్‌పై వేస్తే మంటలు అదుపులోకి వస్తాయి.

మాక్‌డ్రిల్‌తో అవగాహన..

అగ్నిమాపక వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే తీరు.. వాటిని ఎదుర్కొనే విధానంపై ఫైర్‌ సిబ్బందితో కలిసి మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాం. వారం రోజులుగా కేపీహెచ్‌బీ కాలనీ బస్‌స్టాండ్‌, సుజనా ఫోరం మాల్‌, అరబిందో ఫార్మసీ, ఇన్‌కార్‌ అపార్టుమెంట్‌, అంకుర వైద్యశాల, జేఎన్‌టీయూహెచ్‌ హాస్టల్‌లో మాక్‌డ్రిల్‌ను నిర్వహించాం. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలా సురక్షితంగా బయటపడాలి అన్న అంశాలతో పాటు ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. అగ్ని, షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. 101 లేదా 040-23155101 నంబర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తాం. ముందస్తు జాగ్రత్తలతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. -వై.కృష్ణారెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌, కూకట్‌పల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముందస్తు జాగ్రత్తలతోనేమేలు
ముందస్తు జాగ్రత్తలతోనేమేలు
ముందస్తు జాగ్రత్తలతోనేమేలు

ట్రెండింగ్‌

Advertisement