శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 00:50:06

పచ్చడి కోసం గొడవ..ఏడుగురికి గాయాలు

పచ్చడి కోసం గొడవ..ఏడుగురికి గాయాలు

హైదరాబాద్ : పచ్చడి కోసం ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో ఏడుగురికి గాయాలైన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లంగర్‌హౌస్‌ బాపుఘాట్‌లో సుభాష్‌ అనే వ్యక్తి షాపులో ఆదివారం రాత్రి  అంబేద్కర్‌నగర్‌కు చెందిన  బల్వంత్‌సింగ్‌  10 రూపాయల  పచ్చడి  ప్యాకెట్‌  కొన్నాడు. సోమవారం రాత్రి  షాపుకు వచ్చిన అతడు పచ్చడి బాగా లేదని, అలాంటి వస్తువులు అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నావా అంటూ ప్రశ్నించాడు.

దీంతో ఇరువురి  మధ్య గొడవ జరిగింది.  ఆగ్రహం చెందిన బల్వంత్‌సింగ్‌ తన కుమారులను అక్కడికి పిలిపించి షాపు యజమానిపై దాడికి పాల్పడ్డాడు. తగాదాలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 


logo