సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jun 18, 2020 , 01:38:53

కన్న తండ్రే కామాంధుడయ్యాడు

కన్న తండ్రే కామాంధుడయ్యాడు

దుండిగల్‌ : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిగామారి కన్న కూతురిని గర్భవతిని చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సదరు తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సీహెచ్‌.రాజు, సునీత దంపతులకు 14 ఏండ్ల కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రెండేండ్ల నుండి సూరా రం డివిజన్‌ న్యూశివాలయనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటు న్నారు. రాజు పెయింటర్‌గా, అతని భార్య ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో పనిచేస్తోంది. మద్యం తాగే అలవాటున్న రాజు... కొంతకాలం క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి  ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడు. బాలిక గర్భం దాల్చి శారీరకంగా మార్పులు రావడంతో మంగళవారం రాత్రి ఇరుగుపొరుగు వారు ఆరా తీయడంతో బాలికజరిగిన విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థాని కులు నిందితుడు రాజునుస్తంభానికి కట్టేసి చితకబాదారు. వారిచ్చిన సమాచారంతో దుండిగల్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా తప్పు ఒప్పుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo