మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - Aug 25, 2020 , 00:14:43

శరవేగంగా జంక్షన్‌ పనులు

శరవేగంగా జంక్షన్‌ పనులు

అబిడ్స్‌, ఆగస్టు 24 : అబిడ్స్‌ జంక్షన్‌  అభివృద్ధి  పనులు శరవేగంగా సాగుతున్నాయి.  జంక్షన్‌ అభివృద్ధికి రూ. 18 లక్షల   నిధులు విడుదలయ్యాయి  నెల రోజు ల్లో  పనులు పూర్తి చేసేందుకు  అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరిలో అబిడ్స్‌  జంక్షన్‌ను అభివృద్ధి  చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపగా నిధులు విడుదలయ్యాయి.  ప్రత్యేకంగా గార్డెన్‌ ,  సేద తీరేందుకు  బెంచీలు , ఫుట్‌పాత్‌కు మరమ్మతులు, చిన్నపాటి పౌంటేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.   వీలైనంత తొందరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తున్నామని జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌ కపూర్‌ తెలిపారు.  జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, జోనల్‌ ఎస్‌ఈ సహదేవ్‌ రత్నాకర్‌, జీహెచ్‌ఎంసీ పద్నాల్గవ సర్కిల్‌ డీసీ వినయ్‌ కపూర్‌, ఈఈ ప్రకాశం  అభివృద్ధి పనులపై సూచనలు చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.