ఫ్యాషన్, ఓషన్ .. రెండూ ఒకటే. సంద్రం ఏ క్షణంలో ఎలా మారుతుందో ఊహించలేం. కొన్నిసార్లు ప్రౌఢలా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది.కొన్నిసార్లు కౌమారిలా ఎగిసిపడుతుంది. ఫ్యాషన్ ప్రపంచమూ అంతే! ప్రస్తుతం, ఇక్కడ మెటాలిక్ ఆభరణాల హవా నడుస్తున్నది.
ఐలాండ్ ఎస్కేప్
సముద్రం మనిషికి అనంత స్ఫూర్తి. ఐడియాల కొరత వెంటాడిన ప్రతిసారీ ఆశగా సముద్రం వైపు చూస్తాడు. అంతే, ఆ ఆలలే గురువులై ఐడియాలను ప్రసాదిస్తాయి. అల్యూమినియంతో తయారు చేసిన ఈ బ్రేస్లెట్పై సముద్రపు అలలు, నదుల ఒంపులు అందంగా కనిపిస్తాయి. చూస్తేనే ‘బీచ్ లొకేషన్’ అని స్పష్టంగా స్ఫురిస్తుంది.
ఇత్తడి కోటింగ్
బంగారం మెరుపు, వెండి తెలుపు పాతబడిపోయాయి. ఇప్పుడు ఇత్తడి వంతు! స్వర్ణా భరణాలకు ఇత్తడి కోటింగ్ నయా ట్రెండ్. అనితా బెరీషా డిజైన్ చేసిన 14 క్యారెట్ల ఉంగరాన్ని ఇత్తడి కోటింగ్తోనే తయారు చేశారు. ఈ ఉంగరానికి టెక్సురల్ ఫినిష్ ఇచ్చినా కాస్తంత గరుకుగానే ఉంటుంది.
హ్యాంగ్ ఆన్..
జెన్నిఫర్ మెయెర్ అనే డిజైనర్ తయారు చేసిన 18 క్యారెట్ల బంగారపు చెవి దిద్దులకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇందులో, మూడు మార్కిస్ కట్ ప్లేట్స్ ఉంటాయి. ఒక్కో ప్లేట్ సుత్తితో కొట్టినట్లు, గరుకుగా చెక్కినట్లు ఉంటాయి. దీనివల్లే, ఈ దిద్దులకు మరింత మెరుపు వస్తుంది.
మార్కెట్‌ను ఏలేస్తున్న మెటాలిక్ జువెలరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మెటాలిక్లోనూ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికారు డిజైనర్లు. అదే ‘రఫ్ అండ్ టెక్స్చర్డ్ సర్ఫేస్’ డిజైన్. అంటే రకరకాల లోహాలపై గరుకు గరుకుగా వివిధ డిజైన్లను జోడించడం. ఒక్కమాటలో చెప్పాలంటే, ‘అన్ఫినిష్డ్ లుక్’ అన్నమాట.
పేపర్ ట్రెయిల్..
సృజనకారులకు స్ఫూర్తి ఎటువైపు నుంచి అయినా రావచ్చు. ఓ డిజైనర్, ఏదో సందర్భంలో నలిపేసిన కాగితాన్ని చూడగానే ‘యురేకా’ అని కేకలేశారు. ఆ నమూనాలో ఆభరణాల్ని రూపొందించారు. ఇక్కడ మరో ప్రత్యేకతా ఉంది. దీన్ని మొదట రీసైకిల్డ్ వెండితో తయారు చేసి, తర్వాత కోటింగ్ ఇచ్చారు.
ప్యారిస్ బ్రేక్
ఈ డిజైన్‌ను ప్యారిస్‌లో చేత్తోనే చేస్తారు. ఎలీస్ అనే డిజైనర్ తన లేబుల్ ద్వారా ప్యారిస్ బ్రేక్ డిజైన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీని టెక్సర్ అన్‌ఫినిష్‌డ్‌గా, సుతిమెత్తగా సుత్తితో ఓ దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది.
ఓవర్ ది మూన్
చంద్రుడిపై ఉండే గుంతలను చూసి తయారు చేసినవే ఈ క్రేటర్ బ్యాంగిల్స్. వీటిని వందశాతం ఇత్తడితో, ఒక మైక్రాన్ బంగారు ప్లేటింగ్‌తో చేస్తున్నారు.